కరోనా వైరస్ బ్రిటన్ స్ట్రెయిన్‌పై తమ టీకా పని చేస్తుందని అస్ట్రాజెనికా వ్యాక్సిన్ అభివృద్ధి చేసిన పరిశోధకులు చెబుతున్నారు. ఫైజర్, మోడెర్నా టీకాల ఫలితాల మాదిరిగానే దీని ప్రభావం కూడా ఉంటుందని తెలిపారు.
కొవిడ్ 19 సోకిన వ్యక్తుల్లో వైరస్ ప్రభావాన్ని తగ్గిస్తుందని టీకా తయారీలో భాగస్వామ్యమైన ఆక్స్ఫార్ట్ యూనివర్సిటీకి చెందిన ఆండ్రూ పొలార్డ్ పేర్కొన్నారు. ఇది వ్యాధి వ్యాప్తిని నెమ్మదిస్తుందని వివరించారు. దీనిపై జరిగిన పరిశోధన ఇంకా 'పీర్ రివ్యూ' జర్నల్‌లో ప్రచురితం కాలేదని తెలిపారు.