ఆస్ట్రాజెనెకా టీకా తీసుకున్నవారి శరీరాల్లో రక్తం గడ్డకడుతోందని వచ్చిన వార్తలు నిజం కావని యూరోపియన్ మెడిసిన్స్ ఏజెన్సీ ప్రకటించింది. అన్నిరకాల పరీక్షల తర్వాతే టీకాను విడుదలైందని తెలిపింది. టీకా పంపిణీ తిరిగి ప్రారంభమైన నేపథ్యంలో డజనుకు పైగా ఐరోపా దేశాలు ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ పంపిణీని మళ్లీ మొదలు పెట్టాయి. కరోనాపై పోరులో ఐరోపా నేతలు అక్కడి ప్రజలకు భరోసా ఇచ్చేందుకు ప్రయత్నించడం వల్లే ఇది సాధ్యమైందని పలువురు అభిప్రాయపడ్డారు.
టీకా సరఫరాలో జాప్యం వల్ల బ్రిటన్లో కేసుల భయం పట్టుకుంది. ఆస్ట్రాజెనెకా తిరిగి పంపిణీ కానున్న నేపథ్యంలో బ్రిటన్లో ఈ వారం నుంచి టీకా సమస్యలు తీరనున్నాయి. ఐరోపాలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పలు దేశాలు లాక్‌డౌన్ విధిస్తున్నాయి.