తెలంగాణ

telangana

ETV Bharat / international

'ఆస్ట్రాజెనెకా టీకా సామర్థ్యం 79 శాతం'

తమ టీకా సామర్థ్యం 79 శాతంగా ఉందని ప్రకటించింది ఆస్ట్రాజెనెకా. అమెరికాలో చేపట్టిన అడ్వాన్స్​డ్​ ట్రయల్ ఫలితాలను సోమవారం వెల్లడించింది.

By

Published : Mar 22, 2021, 1:55 PM IST

Astra Zeneca
ఆస్ట్రాజెనెకా

తాము అభివృద్ధి చేసిన కొవిడ్-19​ వ్యాక్సిన్​ 79 శాతం సామర్థ్యం కలిగి ఉన్నట్లు ప్రకటించింది ఆస్ట్రాజెనెకా. అమెరికాలో చేపట్టిన అడ్వాన్స్​డ్​ ట్రయల్స్​లో ఈ ఫలితాలు వచ్చినట్లు పేర్కొంది.

ఈ ట్రయల్స్​లో 30 వేల మంది వలంటీర్లు పాల్గొన్నారు. అందులో 20వేల మందికి వ్యాక్సిన్​ ఇవ్వగా.. మిగిలినవారికి డమ్మీ డోసులు ఇచ్చారు.

ఈ ఫలితాలను అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ (ఎఫ్​డీఏ)కు ఆస్ట్రాజెనెకా సమర్పించాల్సి ఉంది. ఈ టీకాను అత్యవసర వినియోగానికి అనుమతించే ముందు ఎఫ్​డీఏ సలహా కమిటీ పరశీలించనుంది.

ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 50కిపైగా దేశాలు ఆస్ట్రాజెనెకా టీకాకు అనుమతులు ఇచ్చాయి. ఆస్ట్రాజెనెకా టీకా పనితీరుపై చిన్న గందరగోళం నేపథ్యంలో అమెరికా అధ్యయన ఫలితాల కోసమే శాస్త్రవేత్తలు ఎదురుచూస్తున్నారు.

ఇదీ చూడండి: 'కరోనా కట్టడిలో ఆక్స్​ఫర్డ్ టీకా భేష్​'

ABOUT THE AUTHOR

...view details