తెలంగాణ

telangana

ETV Bharat / international

'ఆరోపణలు అవాస్తవం.. మా టీకా సేఫ్​'

ఆస్ట్రాజెనెకా తయారు చేసిన వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత అనారోగ్య సమస్యలు వస్తున్నాయనే ఆరోపణలను ఆ సంస్థ కొట్టిపారేసింది. టీకా వేసుకున్నవారిలో రక్తం గడ్డకట్టడానికి టీకాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పింది.

astrazeneca denies allegations against corona vaccine
కరోనా టీకాపై ఆరోపణలు అవాస్తవం: ఆస్ట్రాజెనెకా

By

Published : Mar 15, 2021, 8:10 PM IST

ఆస్ట్రాజెనెకా తయారు చేసిన టీకా తీసుకున్న అనంతరం అనారోగ్య సమస్యలు వస్తున్నాయనే ఆరోపణలను ఆ సంస్థ ఖండించింది. ఆస్ట్రాజెనెకా టీకా పంపిణీని యూరప్‌లోని కొన్ని దేశాలు తాత్కాలికంగా నిలిపి వేస్తుండటంపై సంస్థ సోమవారం స్పందించింది. ఎప్పటికప్పుడు టీకా తయారీని పర్యవేక్షిస్తున్నామని, వ్యాక్సిన్‌ తీసుకున్న వారిలో రక్తం గడ్డకట్టడం వంటి సమస్యలు ఏర్పడటానికి టీకాకు ఎటువంటి సంబంధం లేదని సంస్థ స్పష్టం చేసింది.

వ్యాక్సిన్‌ వల్ల రక్తం గడ్డకడుతోందనడానికి రుజువులు లేవని నిపుణులు తేల్చినట్లు ప్రకటించింది. తమ వ్యాక్సిన్ అందరికీ సురక్షితమని సంస్థ వివరించింది. భారత్‌లో ఆస్ట్రాజెనెకా టీకాను సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా ఉత్పత్తి చేస్తోంది. ప్రస్తుతం ఇండియాలో ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌ను విజయవంతంగా పంపిణీ చేస్తున్నారు.

ఇదీ చూడండి:72 ఏళ్ల వయసులో పరీక్ష రాసిన బామ్మ

ABOUT THE AUTHOR

...view details