తెలంగాణ

telangana

ETV Bharat / international

3 నెలలకే తరుగుతున్న... కొవిషీల్డ్‌ టీకా రక్షణ! - కొవిషీల్డ్​ పనితీరుపై లాన్సెట్ నివేదిక

Covid Vaccine Protection: ఆస్ట్రాజెనిగా టీకా అయిన కొవిషీల్డ్​ను తీసుకున్న వారిలో కరోనాను ఎదుర్కొనే శక్తి మూడు నెలలు తర్వాత క్రమక్రమంగా తగ్గుతోందని ది లాన్సెట్​ పత్రిక వెల్లడించింది. ఈ టీకా బూస్టర్‌ డోసు ద్వారా ప్రమాదకర వేరియంట్ల నుంచి రక్షణ పొందవచ్చని సూచించారు.

AstraZeneca Covid Vaccine Protection
కొవిషీల్డ్​

By

Published : Dec 22, 2021, 7:48 AM IST

Covid Vaccine Protection: భారత్‌లో కొవిషీల్డ్‌గా పిలుస్తున్న ఆక్స్‌ఫర్డ్‌-ఆస్ట్రాజెనికా టీకా పనితీరుపై ఎడిన్‌బరో విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఇటీవల ఓ అధ్యయనం సాగించారు. రెండు డోసులు తీసుకున్న 3 నెలల తర్వాత.. ఈ టీకా కారణంగా లభించే రక్షణ క్రమంగా క్షీణిస్తున్నట్టు గుర్తించారు. బూస్టర్‌ డోసు ద్వారా ప్రమాదకర వేరియంట్ల నుంచి రక్షణ పొందవచ్చని సూచించారు.

పరిశోధకులు కేవలం ఒక్క ఆక్స్‌ఫర్డ్‌-ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్‌ తీసుకున్నవారినే పరిగణనలోకి తీసుకున్నారు. ఈ వివరాలను 'ద లాన్సెట్‌' పత్రిక వెల్లడించింది. స్కాట్లాండ్‌, బ్రెజిల్‌కు చెందిన మొత్తం 4.4 కోట్ల మందిలో టీకా కారణంగా ఏర్పడిన యాంటీబాడీలస్థాయికి సంబంధించిన డేటాను విశ్లేషించినట్లు గ్లాస్గో వర్సిటీ ఆచార్యుడు కటికిరెడ్డి శ్రీనివాస విఠల్‌ వెల్లడించారు.

ఇదీ చూడండి:పార్లమెంటులో కరోనా కలకలం.. ఆ ఎంపీకి పాజిటివ్​

ABOUT THE AUTHOR

...view details