ఆక్స్ఫర్డ్-ఆస్ట్రాజెనెకా టీకా మూడో దశ ట్రయల్స్ ప్రస్తుతం తాత్కాలికంగా నిలిచిపోయాయి. అయితే.. ట్రయల్స్‌కు బ్రేక్ పడినా ఈ ఏడాది చివరి నాటికి లేదా 2021 తొలినాళ్లలో అందుబాటులోకి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు సంస్థ కార్యనిర్వాహణ అధికారి (సీఈఓ) పాస్కల్ సోరియట్. టీకా ట్రయల్స్‌లో ఇలాంటివి జరగటం సాధారణమేనని తెలిపారు.
టర్టోయిస్ మీడియా గ్రూప్ నిర్వహించిన కార్యక్రమంలో.. గార్డియన్ న్యూస్‌పేపర్ కథనాన్ని పేర్కొంటూ ఈ మేరకు వ్యాఖ్యానించారు పాస్కల్. వచ్చే వారంలోనే కొవిడ్-19 వ్యాక్సిన్ ట్రయల్స్‌ను పునరుద్ధరించే అవకాశం ఉందని నివేదించింది గార్డియన్ వార్తా సంస్థ.
" ఈ ఏడాది చివరి నాటికి లేదా వచ్చే ఏడాది తొలినాళ్లలోనే వ్యాక్సిన్ తీసుకొస్తాం. డిసెంబర్ నాటికి నియంత్రణ సంస్థల అనుమతుల కోసం మా టీకా డేటాను సమర్పిస్తామనే నమ్మకం ఉంది."