తెలంగాణ

telangana

ETV Bharat / international

అసాంజేకు జైలు శిక్ష విధించిన బ్రిటన్​ కోర్టు - వీకిలీక్స్​

వికీలీక్స్​ వ్యవస్థాపకుడు జులియన్​ అసాంజేకు బ్రిటన్​లోని ఓ కోర్టు 50 వారాల జైలు శిక్ష విధించింది. బెయిల్​ నిబంధనలు ఉల్లంఘించినందుకు ఈ తీర్పునిచ్చింది న్యాయస్థానం.

జులియన్‌ అసాంజ్‌

By

Published : May 1, 2019, 5:31 PM IST

వికీలీక్స్​ వ్యవస్థాపకుడు జులియన్​ అసాంజేకు మరో ఎదురుదెబ్బ తగిలింది. 2012లో బెయిల్​ నిబంధనలను ఉల్లంఘించినందుకు బ్రిటన్​లోని సౌత్​వార్క్​ క్రౌన్​ కోర్టు 50 వారాల జైలు శిక్షను విధించింది.

వెస్ట్​మినిస్టర్​ మేజిస్ట్రేట్​ కోర్టు మంజూరు చేసిన బెయిల్​ నిబంధనలను ఉల్లంఘించి కోర్టుకు హాజరు కాలేదు అసాంజే. 2012 నుంచి లండన్​లోని ఈక్వెడార్ దౌత్య కార్యాలయంలో ఆశ్రయం పొందుతున్నారు.

ఇటీవల ఇక్వెడార్​ ఆశ్రయాన్ని రద్దు చేయటం వల్ల బ్రిటన్​ పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. దీనితో గత నెలలో లండన్​లోని వెస్ట్​మినిస్టర్​ కోర్టు అసాంజేను దోషిగా నిర్ధారిస్తూ తీర్పు నిచ్చింది.

దౌత్య కార్యాలయంలో ఉండటం వల్ల బ్రిటన్​లోనే ఉన్నప్పటికీ అసాంజేను చేరుకోలేకపోయామని సౌత్​వార్క్ కోర్టు వ్యాఖ్యానించింది. అమెరికా నుంచి పొంచి ఉన్న ప్రమాదం వల్లే ఇలా చేశారని అసాంజే తరఫు న్యాయవాది కోర్టుకు విన్నవించారు. ఎన్నో కష్టాలను ఎదుర్కున్నానని కోర్టుకు అసాంజే తెలిపినప్పటికీ న్యాయమూర్తి తిరస్కరించారు.

ABOUT THE AUTHOR

...view details