వికీలీక్స్ వ్యవస్థాపకుడు జులియన్ అసాంజేకు బ్రిటన్ కోర్టు బెయిల్ నిరాకరించింది. అసాంజే బయటకు వెళ్తే తిరిగి కోర్టుకు రాడని బ్రిటన్ జడ్జి వనేస్సా బరైట్సర్ అభిప్రాయపడ్డారు. అతన్ని కట్టుదిట్టమైన భద్రత మధ్య జైల్లోనే ఉంచాలన్నారు.
మరోవైపు గూఢచర్యానికి పాల్పడ్డ అసాంజేను తమకు అప్పగించాలంటూ అమెరికా చేసిన ప్రతిపాదనను బ్రిటన్ కోర్టు కొట్టివేసింది. ఈ నిర్ణయంపై అమెరికా అప్పీల్‌కు వెళ్తామని తెలిపింది.