వికీలీక్స్ వ్యవస్థాపకుడు జులియన్ అసాంజే అరెస్టును మానవ హక్కుల ఉల్లంఘనగా అభివర్ణించింది ఐక్య రాజ్య సమితి. అసాంజే అరెస్ట్‌పై ఈక్వెడార్, బ్రిటన్లను విమర్శించింది. అసాంజేను అమెరికాకు అప్పగిస్తే ఆయన అత్యంత ప్రమాదకర పరిస్థితులను ఎదుర్కొనే అవకాశం ఉందని అభిప్రాయపడింది.
ఐరాస ప్రత్యేక అధికారి ఆగ్నేస్ కలామార్డ్ ఈ ప్రకటనను విడుదల చేశారు.
"అసాంజేను తీవ్రమైన ప్రమాదంలో పడేశారు. మానవ హక్కుల్ని హరించారు. ఈక్వెడార్ దౌత్య కార్యాలయంలో ఆయనను కలవడానికి బదులు... ఇప్పుడు పోలీసు స్టేషన్లో కలవాల్సిన పరిస్థితి ఏర్పడింది." -ఐరాస ప్రకటన
చట్టానికి ఎవరూ అతీతులు కాదు
అసాంజే అరెస్టును ప్రశంసించారు బ్రిటన్ ప్రధాని థెరిసా మే.
"బ్రిటన్‌లో ఎవరూ చట్టానికి అతీతులు కాదు, బ్రిటన్ పోలీసులు వారి కర్తవ్యాన్ని గొప్పగా నిర్వర్తించారు"
- థెరిసా మే, బ్రిటన్ ప్రధాని