తెలంగాణ

telangana

ETV Bharat / international

తగ్గుతున్న కరోనా తీవ్రత.. తొలగుతున్న ఆంక్షలు

కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను పట్టిపీడిస్తోంది. కేసులు, మరణాలు కొన్ని చోట్ల తగ్గుతుంటే.. అదే సమయంలో వేరే చోట అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఇప్పటివరకు కేసుల సంఖ్య 35 లక్షల 63 వేలు దాటింది. 2 లక్షల 48 వేల మందికి పైగా చనిపోయారు. అమెరికాలో గడిచిన 24 గంటల్లో 1450 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. కొన్ని దేశాల్లో ఆంక్షలు సడలిస్తుండటంతో క్రమంగా ప్రజలు బయటకు వస్తున్నారు.

By

Published : May 4, 2020, 6:55 AM IST

As lockdowns ease, some countries report new infection peaks
కరోనా: తగ్గుతున్న తీవ్రత.. తొలగుతున్న ఆంక్షలు

ప్రపంచవ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 36 లక్షలకు చేరువైంది. ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా 2 లక్షల 48 వేల మందికిపైగా మృత్యువాతపడగా....11 లక్షల 53 వేల మందికిపైగా కోలుకున్నారు.

అమెరికాలో గడిచిన 24 గంటల్లోనే 1450 మందికిపైగా చనిపోగా.. దేశంలో మొత్తం మృతుల సంఖ్య 68 వేల 600కు చేరువైంది. కరోనా బాధితుల సంఖ్య 11 లక్షల 87 వేలు దాటింది. ఐరోపాలోని బ్రిటన్‌లో నిన్న 315 మంది చనిపోగా......ఇటలీలో 174 మంది, స్పెయిన్‌లో 164 మంది, ఫ్రాన్స్‌లో 135 మంది కరోనా మహమ్మారికి బలయ్యారు.

జర్మనీలో శనివారం 54 మంది చనిపోగా...... రష్యాలో 58 మంది ప్రాణాలు కోల్పోయారు. వైరస్‌ విస్తృతి అధికంగా ఉన్న రష్యాలో మెుత్తం కేసుల సంఖ్య లక్షా 35 వేలకు చేరువైంది.

మిగతా దేశాల్లో...

  • బెల్జియంలో 79 మంది, నెదర్లాండ్స్‌లో 69 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • కెనడాలో గడిచిన 24 గంటల్లో 116 మంది చనిపోగా.. మెక్సికోలో 89 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • ప్రపంచంలోనే అతిపెద్ద హట్‌స్పాట్‌గా మారుతోన్న బ్రెజిల్‌లో శనివారం నాడు 275 మంది చనిపోగా కేసుల సంఖ్య లక్ష దాటింది.
  • ఈక్వెడార్‌లో నిన్న 193 మంది ప్రాణాలు విడిచారు.
  • పెరూలో మరో 86 మంది చనిపోయారు. కొత్తగా 3 వేల 394 కేసులు నమోదయ్యాయి.

పాకిస్థాన్‌లో మొత్తం బాధితులు 20 వేల 84 కి చేరారు. ఇప్పటివరకు 457 మంది ప్రాణాలు విడిచారు. సింగపూర్​లో ఆదివారం మరో 657 మంది కరోనా బారినపడ్డారు. దేశంలో ఇప్పటివరకు 18 మరణాలు సంభవించాయి.

మెల్లగా బయటకు..

కరోనా మహమ్మారి దెబ్బకు కొన్నాళ్లుగా ఇళ్లకే పరిమితమైన ప్రజలు క్రమంగా కాలు బయటపెడుతున్నారు. నిషేధాజ్ఞలు తొలగిపోతుండటంతో వీధుల్లోకి వస్తున్నారు. మాస్కులు ధరించి, భౌతిక దూరాన్ని పాటిస్తూ, జాగ్రత్తగా పనులు చేసుకుంటున్నారు. చైనాలో పర్యటక కేంద్రాలు కళకళలాడుతున్నాయి.

స్పెయిన్​లో ఈ ఏడాది మార్చి 14 నుంచి అమల్లో ఉన్న లాక్​డౌన్​ను పాక్షికంగా సడలించారు. దీంతో అనేక మంది ఉదయం నడక కోసం బయటకువచ్చారు. అమెరికా న్యూజెర్సీలో పార్కులు తెరుచుకున్నాయి.

ABOUT THE AUTHOR

...view details