తెలంగాణ

telangana

ETV Bharat / international

అర్మేనియా- అజర్​బైజాన్ శాంతి ఒప్పందానికి తూట్లు

అర్మేనియా-అజర్​బైజాన్​ మధ్య జరిగిన రెండో కాల్పుల విరమణ ఒప్పందానికి కొద్ది గంటల్లోనే తూట్లు పడ్డాయి. ఘర్షణాత్మక ప్రాంతంలో మళ్లీ కాల్పులు జరిగాయి. ఇరువైపులా ప్రాణనష్టం జరిగినట్లు తెలుస్తోంది. మీరంటే మీరే దాడికి పాల్పడ్డారంటూ రెండు దేశాలు ఆరోపణలకు దిగాయి.

By

Published : Oct 18, 2020, 7:25 PM IST

Armenia, Azerbaijan report violations of new ceasefire
కాల్పుల విరమణ ఉల్లంఘించిన అర్మేనియా-అజర్​బైజాన్

కాల్పుల విరమణకు కుదిరిన రెండో ఒప్పందాన్ని అర్మేనియా-అజర్​బైజాన్ ఉల్లంఘించాయి. నాగోర్నో-కరాబఖ్​ ప్రాంతంపై ఆధిపత్యం కోసం చేసుకుంటున్న దాడులను కొనసాగించాయి. కాల్పులు చేసినట్లు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నాయి.

తాజా కాల్పుల విరమణ ఒప్పందానికి ఇరుదేశాలు శనివారం ఆమోదం తెలిపాయి. సెప్టెంబర్ 27న భారీ కాల్పులు జరగడం వల్ల విరమణ ఒప్పందానికి అంగీకారానికి వచ్చాయి.

ఇదీ చదవండి-ఆర్మేనియా- అజర్‌బైజాన్‌ మధ్య నూతన ఒప్పందం

అయితే అజర్​బైజాన్ సైనికదళాలు తుపాకులు, క్షిపణులతో ఆదివారం దాడులు చేశారని అర్మేనియా సైనిక అధికారులు ఆరోపించారు. ఘర్షణాత్మక ప్రాంతంలో రాత్రి సమయంలో దాడులు చేశాయని పేర్కొన్నారు. ఘర్షణ ప్రాంతానికి దక్షిణ దిశగా ఉదయం దాడి చేశారని అర్మేనియా రక్షణ శాఖ ప్రతినిధి సుషాన్ స్టెపానియన్ వెల్లడించారు. ఇరువైపులా ప్రాణ నష్టం సంభవించిందని తెలిపారు.

అయితే అర్మేనియా వ్యాఖ్యలను అజర్​బైజాన్ రక్షణ శాఖ ఖండించింది. అర్మేనియా దళాలే కాల్పులు చేశాయని ఆరోపించింది. నాగోర్నో-కరాబాఖ్ ప్రాంతానికి దక్షిణ సరిహద్దు వెంబడి భారీ ఆయుధాలతో దాడులకు పాల్పడిందని చెప్పుకొచ్చింది.

ఇదీ చదవండి-యుద్ధమేఘాలు: ఆర్మేనియా- అజర్‌బైజాన్‌ వివాదమేంటి ?

ABOUT THE AUTHOR

...view details