వివాదాస్పద నాగోర్నో-కరాబఖ్ ప్రాంతంపై ఆధిపత్యం కోసం ఆర్మేనియా, అజర్‌బైజాన్ దేశాల మధ్య జరుగుతున్న పోరు సద్దుమణిగినట్లే కనిపిస్తోంది. ఈ ప్రాంతంలో కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకున్నట్లు.. ఇరు దేశాల దౌత్యవేత్తలు ప్రకటించారు. రష్యా మధ్యవర్తిత్వంతో ఇరు దేశాలు ఈ అభిప్రాయానికి వచ్చాయి.
10 గంటల పాటు చర్చలు..
ఖైదీల మార్పిడి సహా మృతదేహాల అప్పగింతకు సంధి కుదిరిందని.. మరిన్ని అంశాలపై తర్వాతి కాలంలో ఏకాభిప్రాయానికి వస్తామని తెలిపారు. ఈ మేరకు ఆర్మేనియా-అజార్‌బైజాన్ దేశాల ప్రతినిధులతో... రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్‌రోవ్ సమక్షంలో మాస్కోలో సమావేశమయ్యారు. 10 గంటల పాటు చర్చలు జరిపారు.