అర్జెంటీనాలో 14 లక్షలు దాటిన కరోనా కేసులు - కరోనా లేటెస్ట్ న్యూస్
ప్రపంచదేశాలపై కరోనా ప్రభావం రోజురోజుకూ పెరుగుతోంది. మొత్తం కేసుల సంఖ్య 6.21 లక్షలు దాటింది. రష్యాలో కొత్తగా 27 వేల కేసులు వెలుగులోకి వచ్చాయి. మెక్సికోలో కరోనాతో 631 మంది ప్రాణాలు కోల్పోయారు. పోలండ్‌లో 599 మంది మృతి చెందారు.
అర్జెంటీనాలో 14 లక్షలు దాటిన కరోనా కేసులు
ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 6 కోట్ల 21 లక్షలు దాటింది. మరణాల సంఖ్య 14 లక్షల 52 వేలకు చేరింది. అమెరికాలో అత్యధికంగా కోటీ 34 లక్షల మందికి వైరస్ సోకింది. అందులో 2.71 లక్షల మంది మరణించారు.
- రష్యాలో కొత్తగా 27,100 కేసులు వెలుగులోకి వచ్చాయి. 510 మంది ప్రాణాలు కోల్పోయారు. ఫలితంగా కేసుల సంఖ్య 22.42 లక్షలకు చేరగా.. మరణాల సంఖ్య 39 వేలు దాటింది.
- ఆస్ట్రియాలో గత పది రోజుల్లో కొవిడ్ సంబంధిత మరణాల సంఖ్య వెయ్యి దాటింది. 24 గంటల వ్యవధిలో 132 మంది మరణించగా.. మొత్తం మృతుల సంఖ్య 3,018కి పెరిగింది. కొత్తగా 4,669 కేసులు నమోదయ్యాయి. మొత్తం కరోనా బాధితుల సంఖ్య 2,75,661కి చేరింది.
- దక్షిణ కొరియాలో 504 కరోనా కేసులు వెలుగులోకి వచ్చాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 33,375కి పెరిగింది. ఇప్పటివరకు 522 మంది మరణించారు.
- అర్జెంటీనాలో 24 గంటల వ్యవధిలో 275 మంది మరణించారు. దేశవ్యాప్తంగా కరోనాతో మృతి చెందినవారి సంఖ్య 38,216కు చేరుకుంది. కొత్తగా 7,846 కేసులు వెలుగులోకి వచ్చాయి. మొత్తం బాధితుల సంఖ్య 14 లక్షలు దాటింది.
- ఉక్రెయిన్‌లో కరోనా ప్రబలుతోంది. 16 వేల మందికి కొత్తగా వైరస్ సోకింది. తాజాగా 184 మంది మరణించారు. దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 7 లక్షలు దాటిపోయింది. మొత్తం 12,093 మంది కరోనాకు బలయ్యారు.
- మెక్సికో, పోలండ్ దేశాల్లో కరోనా మరణమృదంగం చేస్తోంది. మెక్సికోలో 631 మంది ప్రాణాలు కోల్పోగా.. పోలండ్‌లో 599 మంది కరోనాకు బలయ్యారు.
దేశం | కేసులు | మరణాలు |
అమెరికా | 1,34,54,346 | 2,71,029 |
రష్యా | 22,42,633 | 39,068 |
బ్రెజిల్ | 62,38,350 | 1,71,998 |
ఫ్రాన్స్ | 21,96,119 | 51,914 |
అర్జెంటీనా | 14,07,277 | 38,216 |
మెక్సికో | 10,90,675 | 1,04,873 |
పోలాండ్ | 9,73,593 | 16,746 |
ఉక్రెయిన్ | 7,09,701 | 12,093 |