బ్రిటిష్-స్వీడిష్ ఫార్మా దిగ్గజం ఆస్ట్రాజెనెకా కొవిడ్ (AstraZeneca news)వ్యతిరేక పోరాటానికి మరో ఆయుధాన్ని అందించేందుకు సిద్ధమవుతోంది. తాజాగా ఆ సంస్థ పరిశోధనలు డ్రగ్ లాంగ్ యాక్టింగ్‌యాంటీ బాడీ(లాబ్) కాక్‌టెయిల్ తుదిదశ ప్రయోగాల్లో సానుకూల ఫలితాలను ఇచ్చింది. దీనిని AZD7442గా వ్యవహరిస్తున్నారు. ఈ ఔషధం(astrazeneca covid medicine) తీవ్రమైన వ్యాధి లక్షణాలు, ఆసుపత్రిలో చేరని పేషెంట్లలో మరణాలను పూర్తిగా తగ్గించింది. ముఖ్యంగా తేలికపాటి నుంచి మధ్యస్థ లక్షణాలు ఉన్న వారిలో ఈ ఔషధం బాగా పనిచేసినట్లు మూడో విడత ప్రయోగ ఫలితాలు చెబుతున్నాయి. వ్యాధి సోకకుండా ముందు జాగ్రతగా కూడా దీనిని వినియోగించవచ్చు.
ఆసుపత్రిలో చేరని పేషెంట్లకు AZD7442 కాక్‌టెయిల్‌ను 600 ఎంజీ కండరాలకు ఇంజెక్షన్ రూపంలో ఇచ్చారు. ఇది తీవ్రమైన కొవిడ్ లక్షణాలు రాకుండా అడ్డుకొంది. ఇక ప్లసిబోతో పోల్చుకొంటే మృత్యువు ముప్పును 50శాతం తగ్గించింది. పైగా ప్లసిబో తీసుకొన్న వారిలో కంటే ఈ కాక్‌టెయిల్ తీసుకొన్న వారిలో తక్కువ ప్రతికూల ప్రభావాలు ఎదురయ్యాయి. ఈ ప్రయోగంలో పాల్గొన్న 90 శాతం మంది ఆరోగ్య సమస్యలు ఉండి.. కొవిడ్ ముప్పు పొంచి ఉన్నవారే ఉన్నారు.