యాంటీ వైరల్ కోటింగ్ టెక్నాలజీతో మాస్క్‌పై ఎలాంటి కరోనా వైరస్ మ్యుటెంట్లు అయినా హతమవుతాయని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ సాంకేతికతకు 'డియో ఎక్స్' అని పేరు పెట్టారు. ఈ సాంకేతికతతో... బ్రిటన్‌లో వ్యాపిస్తోన్న కెంట్ వేరియంట్, దక్షిణాఫ్రికాలో వ్యాప్తిస్తోన్న మరో వైరస్ వేరియంట్లను సైతం అంతమొందించొచ్చని నిపుణులు భావిస్తున్నారు.
"మాస్క్‌పై యాంటీవైరల్ పూత పూయడం ద్వారా అది వైరస్ పైపొరను అంతం చేస్తుంది. ఎలాంటి మ్యుటెంట్లకైనా పైపొర ఒకే మాదిరిగా ఉంటుంది. ఈ తరుణంలో వివిధ వైరస్ వేరియంట్లను అంతం చేయడం సులభమవుతుంది" అని కెమికల్ ఇంజనీరింగ్ విభాగానికి చెందిన ప్రొఫెసర్ డాక్టర్ గ్రహమ్ క్రిస్టీ పేర్కొన్నారు. దాదాపు అన్ని కరోనా వైరస్ వేరియంట్లు ఒకే మాదిరిగా ఉన్నందున... ఇది అన్ని వేరియంట్లపై ప్రభావం చూపుతుందని భావిస్తున్నట్లు తెలిపారు.