చైనా 71వ జాతీయ దినోత్సవం సందర్భంగా.. లండన్‌లో చైనా వ్యతిరేక నిరసనలు హోరెత్తాయి. హాంకాంగ్, జింజియాంగ్, టిబెట్ దేశాలపై.. చైనా ఆధిపత్యాన్ని నిరసిస్తూ ఆందోళన చేపట్టారు. ఆయా దేశాల జెండాలతో తమ వంతు మద్దతు తెలిపారు.
హాంకాంగ్‌లో జాతీయ భద్రతా చట్టం అమలుకు వ్యతిరేకంగా.. చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ(సీసీపీ)పై నిరసనకారులు ఆసమ్మతి ప్రకటించారు. ఆ దేశానికి స్వేచ్ఛ కల్పించాలని డిమాండ్ చేస్తూ.. రహదారిపై బైటాయించారు.
కెనడాలోనూ..
కెనడాలోనూ చైనా వ్యతిరేక నిరసనలు కొనసాగాయి. టొరంటోలోని చైనా కాన్సులేట్ కార్యాలయం వెలుపల.. హాంకాంగ్, టిబెట్, వియత్నాం, మంగోలియా, తైవాన్ తదితర దేశీయులు ఆందోళన నిర్వహించారు. ప్రవాస భారతీయులూ ఇందులో పాల్గొన్నారు.
60 మంది అరెస్ట్
హాంకాంగ్‌లో నిరసనల్లో భాగంగా 60 మంది నిరసనకారుల్ని అరెస్ట్ చేశారు అక్కడి పోలీసులు. కొవిడ్ నిబంధనలను ఉల్లంఘించిన కారణంగా మరో 20 మందికి జరిమానా విధించారు. దీంతో ఆగ్రహించిన ఆందోళనకారులు.. పోలీసు వ్యతిరేక నినాదాలు చేశారు.
ఇదీ చదవండి:కరోనా బారిన పడిన ప్రపంచ నేతలు వీరే..