తెలంగాణ

telangana

ETV Bharat / international

బ్రిటన్ ఎన్నికల్లో జట్టుకట్టనున్న బ్రెగ్జిట్ వ్యతిరేక పార్టీలు - britain latest news

వచ్చే నెలలో జరగనున్న బ్రిటన్ సార్వత్రిక​ ఎన్నికల్లో మెజారిటీ సాధించి బ్రెగ్జిట్​ ఒప్పందాన్ని గట్టెక్కించాలన్న పట్టుదలతో ఉన్నారు ఆ దేశ ప్రధాని బోరిస్​ జాన్సన్​. ఇవే ఎన్నికలను తమకు అనుగుణంగా మలుచుకుని బ్రెగ్జిట్​ను వ్యతిరేకించే అభ్యర్థులను గెలిపించాలని చిన్న పార్టీలు ఏకమవుతున్నాయి.

బ్రిటన్ ఎన్నికల్లో జట్టుకట్టనున్న బ్రెగ్జిట్ వ్యతిరేక పార్టీలు

By

Published : Nov 8, 2019, 5:45 AM IST

Updated : Nov 8, 2019, 7:07 AM IST

బ్రెగ్జిట్​తో సతమతమవుతున్న బ్రిటన్​... సార్వత్రిక ఎన్నికలకు సిద్ధమవుతోంది. ఈ ఎన్నికల్లో మెజారిటీ సంపాదించుకుని.. ఎట్టిపరిస్థితుల్లోనైనా బ్రెగ్జిట్​ ఒప్పందాన్ని కుదుర్చుకోవాలని చూస్తున్నారు బ్రిటన్​ ప్రధాని బోరిస్​ జాన్సన్​. ప్రధానికి, బ్రెగ్జిట్​కు వ్యతిరేకంగా పావులు కదుపుతున్నాయి విపక్ష పార్టీలు. ఇందులో భాగంగా మూడు చిన్న పార్టీలు ఏకమయ్యాయి. లిబరల్​ డెమొక్రాట్స్​, ది గ్రీన్స్​, వెల్ష్​ నేషనలిస్ట్​ పార్టీలు కూటమిగా ఏర్పడి.. బ్రెగ్జిట్​ను వ్యతిరేకించే అభ్యర్థులను గెలిపించాలనే ధ్యేయంతో ముందుకు సాగుతున్నాయి. మొత్తం 650 సీట్లకు గాను 60 స్థానాల్లో పోటీ చేయనుంది ఈ కూటమి. వీటిలో కచ్చితంగా 40పైగా స్థానాలు కైవసం చేసుకుంటామని కూటమి నేతలు విశ్వాసంగా ఉన్నారు.

2016లో నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో 52శాతం మంది బ్రిటన్ ​ప్రజలు బ్రెగ్జిట్​కు అనుకూలంగా ఓటు వేశారు. అయితే బ్రెగ్జిట్​ ఎప్పుడు, ఎక్కడ, ఎలా జరగాలనే అంశంపై ఎంపీల్లో విభేదాలు ఎదురయ్యాయి. ఇందు వల్ల ఇప్పటికీ బ్రెగ్జిట్​ ప్రక్రియ పూర్తి కాలేదు.

ఇదీ చూడండి: భీకర తుపానుకు గ్రీస్​ గజగజ

Last Updated : Nov 8, 2019, 7:07 AM IST

ABOUT THE AUTHOR

...view details