కరోనా వైరస్ వల్ల ప్రపంచంలోని ప్రజలు ఎక్కడికక్కడే ఉండిపోయారు. వైరస్‌పై పోరులో భాగంగా విధించిన లాక్డౌన్ వల్ల పర్యటనలు అమాంతం తగ్గిపోయాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఐరోపావ్యాప్తంగా ఫ్లైట్ల నెట్‌వర్క్‌ను నియంత్రించే యూరో కంట్రోల్ అనే అంతర్జాతీయ ఏవియేషన్ సంస్థ.. ఓ గ్రాఫిక్‌ను విడుదల చేసింది.
ఆ దేశాల్లో 90శాతం విమానాలు నేలపైనే..
యూరో కంట్రోల్ అనే విమానయాన సంస్థ 2019-2020 ఏప్రిల్ నెలకు సంబంధించిన విమాన ప్రయాణాల గ్రాఫిక్‌ను విడుదల చేసింది. చైనా, యూరప్ దేశాల్లో విమాన సర్వీసులపై కరోనా ప్రభావం ఏ మేరకు ఉందో ఈ గ్రాఫిక్‌ను పరిశీలిస్తే స్పష్టంగా అర్థమవుతుంది.
లాక్‌డౌన్‌తో నెలకే విమానాలు.. ఐరోపాలో పరిస్థితి ఇలా
ఐరోపా, చైనాల్లోని గగనతలంలో విమానాల ప్రయాణాల్లో గతేడాది-ఈ ఏడాదికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ఆ గ్రాఫిక్ చిత్రాల ద్వారా వివరించింది. ప్రపంచంపై కరోనా ప్రభావం ఎలా ఉందనే విషయం స్పష్టం చేసింది.
2019 ఏప్రిల్‌తో పోల్చితే.. ఈ ఏడాది ఏప్రిల్‌లో 90శాతం విమాన సర్వీసులు తగ్గాయని పేర్కొంది యూరో కంట్రోల్.