తెలంగాణ

telangana

ETV Bharat / international

భారత్‌, జర్మనీల మధ్య విమాన సర్వీసులు బంద్​! - covid in india

సెప్టెంబర్​ 30 నుంచి అక్టోబర్​ 20 వరకు భారత్​, జర్మనీల మధ్య నడిచే విమాన సర్వీసులు రద్దయ్యాయి. ఇరు దేశాల మధ్య విమానాల రాకపోకలను రద్దు చేసినట్లు జర్మనీ ప్రకటించింది. ఈ మేరకు ఆ దేశ అధికారిక విమానయాన సంస్థ లుఫ్తాన్సా ప్రకటన విడుదల చేసింది.

AI cancels all Frankfurt flights till Oct 14 as Germany withdraws permission to operate them
భారత్‌, జర్మనీల మధ్య విమాన సర్వీసులు బంద్​!

By

Published : Oct 2, 2020, 4:49 AM IST

భారత్‌, జర్మనీల మధ్య విమానాల రాకపోకలను రద్దు చేసినట్టు జర్మనీ ప్రకటించింది. ఈ మేరకు ఆ దేశ అధికారిక విమానయాన సంస్థ లుఫ్తాన్సా ఓ ప్రకటన విడుదల చేసింది. తమ వైమానిక ప్రణాళికను భారతీయ అధికారులు అనుకోని విధంగా తిరస్కరించినందున తాము ఈ నిర్ణయం తీసుకున్నట్టు సంస్థ ప్రకటించింది.

ఎయిర్‌ బబుల్‌ అప్పుడు మాత్రమే..

''సెప్టెంబర్‌ చివరి వరకు అనుమతించిన ప్రత్యేక విమానాలను ఆపై కూడా కొనసాగించాలని లుఫ్తాన్సా భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. అయితే భారత ప్రభుత్వం దీనిని అనుకోని విధంగా తిరస్కరించటంతో.. సెప్టెంబర్‌ 30 నుంచి అక్టోబర్‌ 20 మధ్యలో భారత్‌, జర్మనీల మధ్య నడిచే అన్ని విమానాలను రద్దు చేయాల్సి వచ్చింది. అంతేకాకుండా ఇరుదేశాల మధ్య ఎయిర్‌ బబుల్‌ ఏర్పాటు.. ఆయా దేశాల్లో కొవిడ్‌-19 పరిస్థితి ఒకే మాదిరిగా ఉన్నప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. భారత్‌లో కరోనా వైరస్‌ కేసులు పెరుగుతూ ఉన్న నేపథ్యంలో జర్మనీ ఈ ఏర్పాటుకు అంగీకరించలేదు.'' అని లుఫ్తాన్సా ఓ ప్రకటనలో తెలిపింది.

ప్రతికూలతలున్నాయి: భారత్‌

ఈ విషయంపై భారత్‌కు చెందిన డైరక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్ (డీజీసీఏ) స్పందించింది.

''జర్మనీతో ఎయిర్‌ బబుల్‌ ఒప్పందం వల్ల భారత్‌కు కొన్ని ప్రతికూల అంశాలున్నాయి. ఆ దేశంలో భారతీయుల రాకపై ఉన్న ఆంక్షల వల్ల.. భారత్‌ వారానికి మూడు నుంచి నాలుగు విమానాలు మాత్రమే నడపగలుగుతోంది. మరో వైపు లుఫ్తాన్సా భారత్‌కు 20 సర్వీసులను నడుపుతోంది. ఈ విధమైన అసమానతలున్నప్పటికీ భారత్‌ లుఫ్తాన్సాకు వారానికి ఏడు విమాన సర్వీసులు నడిపేందుకు అనుమతించింది. అయితే ఈ ప్రతిపాదనను జర్మనీ తిరస్కరించింది. ఈ విషయమై ఇరుదేశాల మధ్య చర్చలు కొనసాగుతున్నాయి.'' అని డీజీసీఏ వివరించింది.

కరోనా వైరస్‌ లాక్‌డౌన్‌ కాలంలో విమానయానానికి సంబంధించి ఎయిర్‌ బబుల్‌ అనే ప్రత్యేక విధానం తీసుకొచ్చారు. దీని ప్రకారం.. రెండు దేశాల జాతీయ వైమానిక సంస్థలు ప్రయాణికుల రాకపోకలను ఇరుదేశాలు ఏ ఆంక్షలు లేకుండా అనుమతిస్తాయి. కాగా భారత్‌ ప్రస్తుతం అమెరికాతో సహా బ్రిటన్‌, యూఏఈ, మాల్దీవులు, ఫ్రాన్స్‌, జర్మనీ, కెనడా, ఖతార్‌, బహ్రైన్‌, నైజీరియా, ఇరాక్‌, అఫ్గానిస్థాన్, జపాన్‌ వంటి 13 దేశాలతో ఈ ఒప్పందం కుదుర్చుకుంది. మరిన్ని ఇతర దేశాలతో కూడా ఈ ఏర్పాటు చేసుకునేందుకు చర్చలు కొనసాగుతున్నాయి.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details