ఆర్థిక న్యాయం కోసం ఫ్రాన్స్‌లో ఎల్లో వెస్ట్(పసుపు జాకెట్) ఉద్యమాన్ని నిరసనకారులు పునఃప్రారంభించారు. అధ్యక్షుడు ఇమ్మాన్యూయేల్ మేక్రాన్‌కు వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టారు. ప్రజలు వీధుల్లోకి వచ్చి నిరసనల్లో పాల్గొన్నారు.
ఎల్లో వెస్ట్ నిరసనల్లో కారు దగ్ధం రాజధాని పారిస్‌లో జరిగిన రెండు ర్యాలీల్లో కలిపి వెయ్యి మంది పాల్గొన్నారని ఫ్రాన్స్ మీడియా సంస్థలు వెల్లడించాయి. రెండేళ్ల క్రితం నిరసనలు ప్రారంభమైనప్పటితో పోలిస్తే ఈ సంఖ్య తక్కువేనని అభిప్రాయపడ్డాయి.
ద్విచక్ర వాహనానికి నిప్పంటించిన ఆందోళనకారులు నిరసనల్లో భాగంగా తలెత్తిన చిన్నపాటి ఘర్షణలను అదుపు చేసేందుకు పోలీసులు భాష్పవాయు గోళాలు ప్రయోగించారు. 25 మందిని అరెస్టు చేసినట్లు తెలిపారు. 200 మందికి పైగా నిరసనకారులను అడ్డుకున్నట్లు వెల్లడించారు. పారిస్ మెట్రో సహా పలు ప్రాంతాలను తాత్కాలికంగా మూసివేశారు.
నిరసనకారులపై పోలీసులు భాష్పవాయు గోళాల ప్రయోగం ఇంధన ధరలపై పన్ను పెంపునకు నిరసనగా 2018లో ఫ్రాన్స్‌లో ఎల్లో వెస్ట్ ఉద్యమం మొదలైంది. వాహన చోదకులు ధరించే పసుపు రంగు చొక్కాను ఉద్యమానికి గుర్తుగా పరిగణిస్తున్నారు.
ఎల్లో వెస్ట్ నిరసనల్లో ఆస్తుల ధ్వంసం