బ్రిటన్ సెంట్రల్ లండన్‌లోని ఓ ప్రఖ్యాత వీధి అది. ఆ వీధిని ఆక్స్‌ఫర్డ్ స్ట్రీట్ అని పిలుస్తారు. కరోనాకు ముందు షాపింగ్‌కు వచ్చే జనంతో ఆ వీధి మొత్తం కిటకిటలాడేది. ప్రస్తుతం లాక్‌డౌన్ కారణంగా రద్దీ పెద్దగా లేదు. అయితే, శుక్రవారం ఆ వీధి గుండా వెళ్లేవారిని ఓ వ్యక్తి ఆశ్చర్యానికి, అయోమయానికి గురిచేశాడు. ఇంతకు అతడు చేసిన పనేమిటి అనుకుంటున్నారా..? మొల భాగంలో మాస్కు తప్ప ఒంటిపై నూలుపోగు కూడా లేకుండా ఆక్స్‌ఫర్డ్ వీధి గుండా నడుచుకుంటూ వెళ్లాడు.
మొలకు మాస్కు కట్టి.. లండన్ వీధుల్లో.. - మొలకు మాస్కు కట్టి.. లండన్ వీధుల్లో..
కరోనా కాలంలో అంతా ముఖానికి మాస్కు ధరిస్తున్నారు. అయితే ఓ వ్యక్తి ఇందుకు భిన్నంగా ప్రవర్తించాడు. ముఖానికి ధరించాల్సిన మాస్కును మొలకు కట్టి ప్రఖ్యాత లండన్ వీధుల్లో కలియతిరిగాడు. ఆశ్చర్యానికి గురిచేసే ఈ కథేమిటో మీరే చూసేయండి.
అయితే.. ఒక్కసారిగా ఒంటిపై బట్టలు లేకుండా వ్యక్తి ఎదురుపడటంతో కొంతమంది నవ్వుకున్నారు. మరి కొంతమంది ఈసడించుకున్నారు. ఇంకొంత మంది నోరెళ్లబెట్టి చూశారు. కొందరైతే ఏకంగా తమ ఫోన్‌లలో ఫొటోలు, వీడియోలు కూడా తీసుకున్నారు. కానీ, ముఖానికి మాస్కు లేకున్నా మొలకు మాత్రం మాస్కు ధరించి ప్రదర్శన చేయడం వెనుక అతని ఉద్దేశం ఏమిటనేది మాత్రం ఎవరికీ అర్థం కాలేదు. కాగా, ఈ దృశ్యాలను రాయిటర్స్ సంస్థకు చెందిన కెమెరామెన్ తమ కార్యాలయం భవనం పైనుంచే తన కెమెరాలో బంధించాడు.