తెలంగాణ

telangana

ETV Bharat / international

'పర్యావరణ పరిరక్షణే 'హాట్​ టాపిక్'​.. కానీ'

స్విట్జర్లాండ్​​లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో భాగంగా నిర్వహించిన ఓ కార్యక్రమంలో గ్రెట్​ థన్​బర్గ్​ పాల్గొంది. పర్యావరణ పరిరక్షణ కోసం తాను చేపట్టిన ఉద్యమం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందుతోందని తెలిపింది. ప్రజల్లో ఇదే హాట్​ టాపిక్​ అని పేర్కొంది. కానీ భూమిని రక్షించే చర్యలు మాత్రం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది.

A lot has happened, but nothing has been done as yet: Greta Thunberg
'పర్యావరణ పరిరక్షణే 'హాట్​ టాపిక్'​.. కానీ'

By

Published : Jan 21, 2020, 7:13 PM IST

Updated : Feb 17, 2020, 9:35 PM IST

'పర్యావరణ పరిరక్షణే 'హాట్​ టాపిక్'​.. కానీ'

భూమాతను రక్షించేందుకు సరైన చర్యలు ప్రయత్నాలు జరగడం లేదని ఆవేదన వ్యక్తంచేసింది పర్యావరణ పరిరక్షణ ఉద్యమకారిణి గ్రెటా థన్​బర్గ్​. ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సదస్సు సందర్భంగా స్విట్జర్లాండ్​లోని దావోస్​లో జరిగిన కార్యక్రమంలో ప్రసంగించింది 17 ఏళ్ల గ్రెటా. తన ఉద్యమానికి ప్రపంచవ్యాప్తంగా ఆదరణ లభిస్తున్నప్పటికీ... భూమిని కాపాడేందుకు చేపట్టిన చర్యలు మాత్రం శూన్యమని అభిప్రాయపడింది.

"ఒక రకంగా చూస్తే పర్యావరణం అంశంలో చాలా మార్పు వచ్చింది. అనేక ప్రాంతాల నుంచి ఈ ఉద్యమానికి మద్దతు లభిస్తోంది. ఇది ఒక పెద్ద అడుగు. ఈ విషయంపై ఇప్పుడు ప్రజల్లో ఓ అవగాహన ఏర్పడింది. పర్యావరణమే ఇప్పుడు హాట్​ టాపిక్​. యువత వల్లే ఇది సాధ్యపడింది. వారికి ధన్యవాదాలు. మరోవైపు నుంచి చూస్తే.. పర్యావరణ పరిక్షణకు అసలేం జరగలేదు. కర్బన ఉద్గారాలను కట్టడి చేయడానికి ఇంకా ఎలాంటి చర్యలు చేపట్టలేదు. వాటిని కట్టడి చేయడం మా ఉద్యమంలోని ప్రధాన అంశాల్లో ఒకటి."
-- గ్రెటా థన్​బర్గ్​

గ్రెటాతోపాటు ఈ కార్యక్రమంలో జాంబియా, ప్యూర్టో రికోకు చెందిన యువ పర్యావరణవేత్తలు నటాషా వాన్స, సాల్వెడార్​ జీ మెజ్​, కెనడా చీఫ్​ వాటర్​ కమిషనర్​ ఆటమ్​ పెల్టియర్​ పాల్గొన్నారు.

ఇదీ చూడండి: చిల్​ గ్రెటా, చిల్​..! సినిమా చూసి ఎంజాయ్​ చెయ్​: ట్రంప్​

Last Updated : Feb 17, 2020, 9:35 PM IST

ABOUT THE AUTHOR

...view details