తెలంగాణ

telangana

ETV Bharat / international

నిలువనీడ లేని టూరిస్ట్ గైడ్... సెలబ్రిటీగా మారాడు - టూరిస్ట్ గైడ్​

అతని వయస్సు 68 ఏళ్లు.. పదేళ్ల క్రితం ఓ ప్రభుత్వ ప్రాజెక్టులో ఇంటిని కోల్పోయి రోడ్డు మీద పడ్డాడు. కానీ అదే అతన్ని ఫేమస్​ చేసింది.. ఆ ప్రాంతంలోని పురాతన కట్టడాల గురించి క్షుణ్ణంగా తెలిసిన అతను పర్యటకులకు గైడ్​ గా మారాడు.. ఎంతలా ఫేమస్​ అయ్యాడంటే పర్యటకులు తను చెప్పే విషయాలకంటే ఆ వ్యక్తి జీవితం గురించే ఎక్కువ తెలుసుకోవాలనుకునేంతగా.

నిలువనీడ లేని టూరిస్ట్ గైడ్... సెలబ్రిటీగా మారాడు

By

Published : Jul 4, 2019, 6:37 AM IST

Updated : Jul 4, 2019, 7:33 AM IST

నిలువనీడ లేని టూరిస్ట్ గైడ్

తెల్లటి గడ్డం, నెరిసిన జుట్టుతో కనిపిస్తున్న ఇతని పేరు విక్నేస్లెవ్​ రాన్సర్. వయస్సు 68 ఏళ్లు. రష్యా లోని సెయింట్​ పీటర్​బర్గ్​ నగరానికి చెందిన ఇతను 10ఏళ్ల క్రితం నివాసాన్ని కోల్పోయి రోడ్డు మీద పడ్డాడు. అప్పటి నుంచి సెయింట్​ వీధుల్లోనే జీవనం సాగిస్తున్నాడు. అయితే​ నగరంలోని నెవ్​స్కీ ప్రాంతపు అందాలు, పురాతన కట్టడాలు, అనువణువూ రాన్సర్​కి తెలుసు. అదే అతడ్ని టూరిస్ట్​ గైడ్​ని చేసింది.

రాన్సర్​ రోజూ ఉదయం 9 గంటల నుంచి నుంచి మధ్యాహ్నం 3 వరకు నావెస్కీ ప్రోస్పెక్ట్​ కట్టడాలను వీక్షించేందుకు వచ్చే పర్యటకుల కోసం స్థానిక సబ్​వే స్టేషన్​ వద్ద నిల్చుంటారు. కావలిసిన వారికి గైడ్​గా ఉంటూ చాలా తక్కువ మందికి మాత్రమే తెలిసిన 15 పురాతనమైన కట్టడాల చరిత్రనంతటినీ వివరిస్తారు.

సెయింట్​ నగర అందాలు అనువణువూ తెలిసిన రాన్సర్​ చెప్పే విషయాలు జ్ఞానాన్ని కలిగిస్తాయి. కానీ వచ్చే పర్యటకులు అతని వ్యక్తిగత జీవితాన్ని తెలుసుకోవడానికి మరింత ఉత్సుకత చూపుతున్నారు.

ఇతని గురించి సామాజిక మాధ్యమాల్లో చాలా సమాచారమే ఉంది. ఇతను అసాధారణ రీతిలో పర్యటక ప్రాంతాల గురించి వివరిస్తారు. అందుకే నేను కూడా ఆ అనుభూతి పొందాలని వచ్చాను.

-ఐవాన్​ పెట్రోవ్​, పర్యటకుడు

భౌగోళిక, వృక్ష శాస్త్రాలను బోధిస్తూనే రాన్సర్... వారాంతాల్లో ఫ్రీలాన్స్​ గైడ్​గా చేస్తున్నారు. సెయింట్​ నగరంలో ఎముకలు కొరికే చలిలో జీవనం సాగించడం ఎంతో నరకంగా ఉంటుంది. తన చుట్టూ ఎప్పటికీ సాయం చేసే వారు ఉంటున్నారని, ఎప్పుడూ ఆకలి ఇబ్బందిని ఎదుర్కోలేదని ఆయన తెలిపారు.

దేవుడు, చుట్టూ ఉన్న వారిపై నమ్మకం కలిగి ఉండాలి. నేను ధూమ, మద్యపానాలను సేవించను. అందుకేనేమో నాకు చలికాలంలోనూ ప్రజలు ఉదారభావంతో సహాయం చేశారు.

-రాన్సర్​, టూరిస్ట్​ గైడ్

ఛారిటీ అందించిన సాయం

పదేళ్ల క్రితం రియల్​ ఎస్టేట్​ మోసపూరిత చర్యలకు నివాసాన్ని కోల్పోయారు రాన్సర్​​. తన గురించి సామాజిక మాధ్యమాల ద్వారా తెలుసుకున్న నోక్లెన్జ్కా​ అనే ప్రైవేట్ సామాజిక సంస్ధ అతనికి ఆవాసం కల్పించింది.

నివాసాలను కోల్పోయిన వారు సోమరితనం, చెడు అలవాట్లు, నిరక్ష్యరాస్యత వంటి పరిణామాలకు లోనవుతారు. రాన్సర్​ మాత్రం తన సృజనాత్మకతతో, నగరంలోని పురాతన కట్టడాలపై ఉన్న పట్టుతో టూరిస్ట్​ గైడ్​గా మారి ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలిచారు.

ఇదీ చూడండి:

జలాంతర్గామిలో మంటలు.. 14 మంది మృతి

Last Updated : Jul 4, 2019, 7:33 AM IST

ABOUT THE AUTHOR

...view details