ఇటలీలో ఆదివారం ఘోర ప్రమాదం జరిగింది. మౌంటెయిన్ కేబుల్ కార్ కూలిన ఘటనలో తొమ్మిది మంది మరణించారు. తీవ్రంగా గాయపడిన ఇద్దరు పిల్లలను ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.
ఆల్ప్స్ పర్వత ప్రాంతాల్లో మోటరోన్ శిఖరంపైకి.. సముద్ర మట్టానికి 1,491 మీటర్లు ఎత్తుకు చేరుకునే ఈ కేబుల్ కార్ పర్యటకులను విశేషంగా ఆకర్షిస్తుంటుంది. అక్కడ ఆల్పైలాండ్ అనే చిన్న ఉద్యానవనం నుంచి 360 డిగ్రీల ప్రకృతి వీక్షణను ఆస్వాదించేందుకు వేసవిలో పర్యటకులు క్యూ కడుతుంటారు. ఇటలీలోని పర్వత ప్రాంతాల్లో ఈ తరహా పర్యటక ప్రాంతాలు అనేకం ఉన్నాయి.