తెలంగాణ

telangana

ETV Bharat / international

వైరస్​ను జయించిన 103 ఏళ్ల బామ్మ

కరోనా వైరస్​ను జయించింది ఇటలీకి చెందిన 103 ఏళ్ల బామ్మ. సెలైన్లు, జ్వరం తగ్గే మాత్రలతోనే వైరస్​పై విజయం సాధించింది. మరణించే అవకాశం ఉందని అంతా అనుకుంటున్న వేళ.. కళ్లు తెరచి తాను వైరస్​కు లొంగనని చాటింది.

italy
వైరస్​ను జయించిన 103 ఏళ్ల బామ్మ

By

Published : Apr 8, 2020, 12:24 PM IST

కరోనా వైరస్​ మరణాల్లో అధికంగా వృద్ధులు, చిన్నారులే ఉంటున్నారు. వయస్సుపైబడిన వారు ఎక్కువ జాగ్రత్తలు పాటించాలని చెబుతున్నారు వైద్యులు. అయితే.. ఇటలీకి చెందిన ఓ 103ఏళ్ల బామ్మ.. కరోనా మహమ్మారిని జయించింది. సెలైన్లు, జ్వరం తగ్గేందుకు ఉపయోగించే మందులతోనే వైరస్​ను గెలిచింది.

ఆదా జనుస్సీ అనే ఈ వృద్ధురాలికి మార్చి నెలలో వైరస్ సోకింది. తీవ్ర అస్వస్థతతో ఓ దశలో అంతా అయిపోయిందని చుట్టూ ఉన్నవారు అనుకున్నారు. అయితే జ్వరం తగ్గే మందులు, సెలైన్లతో ఆశ్చర్యంగా కోలుకుంది ఆ బామ్మ. ఏడు రోజుల అనంతరం కళ్లు తెరచి చూసింది.

వైద్యుడి ఆనందం..

గత 35 ఏళ్లుగా జనుస్సీకి కార్లా ఫర్నో మార్చీస్ అనే డాక్టర్ వైద్య సేవలు అందిస్తున్నాడు. తన పేషెంట్ తిరిగి కోలుకోవడంపై ఆనందం వ్యక్తం చేశాడు. ఇప్పుడు ఆమె వార్తా పత్రికలు చదువుతోందని, మొబైల్​ ఫోన్​లో మాట్లాడుతుందని చెప్పాడు.

ఉత్తర ఇటలీలో నివాసం ఉండే జనుస్సీ.. వస్త్ర తయారీ ఫ్యాక్టరీలో పనిచేసి పదవి విరమణ చేసింది. అనంతరం లెజోనాలోని మరియా గ్రేజియా అనే వృద్ధాశ్రమంలో కాలం గడుపుతోంది. జనుస్సీ నివాసం ఉండే వృద్ధాశ్రమంలోని పలువురికి వైరస్ పాజిటివ్​గా తేలిన కారణంగా అక్కడున్న అందరిని నిర్బంధంలో ఉంచారు అధికారులు. వైద్యులను మాత్రమే అనుమతిస్తున్నారు.

వైరస్​ను జయించిన 103 ఏళ్ల బామ్మ

ఇదీ చూడండి:అమెరికాలో కరోనా ఉగ్రరూపం- డబ్ల్యూహెచ్​ఓపై ట్రంప్ ధ్వజం

ABOUT THE AUTHOR

...view details