ప్రపంచవ్యాప్తంగా హత్యకు గురైన పాత్రికేయుల కేసుల్లో 90శాతం మంది హంతకులకు శిక్షపడలేదని యునెస్కో తెలిపింది. గత రెండేళ్లలో జరిగిన జర్నలిస్టుల హత్యల్లో 55శాతం.. ఘర్షణలు లేని ప్రాంతాల్లో చోటుచేసుకున్నట్లు వెల్లడించింది. రాజకీయం, నేరాలు, అవినీతి వంటి అంశాలను లేవనెత్తిన పాత్రికేయులే లక్ష్యంగా దుండగులు కిరాతకానికి పాల్పడుతున్నట్లు యునెస్కో పేర్కొంది.
2006 నుంచి 2018 వరకు 1109 జర్నలిస్టుల హత్యలకు కారణమైన హంతకుల్లో 90 శాతం మంది దోషులుగా తేలలేదని యునెస్కో స్పష్టం చేసింది. అంతర్జాతీయ జర్నలిస్టులపై నేరాల వ్యతిరేక దినోత్సవం(నవంబరు 2)కు ఒక్కరోజు ముందు 'ఇంటెన్సిఫైడ్ ఎటాక్స్-న్యూ డిపెన్సెస్' పేరుతో ఈ నివేదికను విడుదల చేసింది యునెస్కో.
గతంతో పోలిస్తే 2014-18 మధ్యకాలంలో పాత్రికేయుల హత్యలు 18శాతం పెరిగినట్లు నివేదిక వెల్లడించింది.