తెలంగాణ

telangana

ETV Bharat / international

కరోనా బాధితుల్లో విటమిన్-డి లోపం! - కరోనా వైరస్ తాజా వార్తలు

కరోనా సోకిన వ్యక్తుల్లో విటమిన్-డి లోపాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. స్పెయిన్​లో 216 మంది రోగులను పరీక్షించగా.. 80 శాతం మందికి విటమిన్ క్షీణించినట్లు తేలింది.

COVID-19 vitamin D
కరోనా

By

Published : Oct 28, 2020, 11:01 PM IST

స్పెయిన్‌లో కరోనా బారిన పడ్డ అనేక మంది రోగుల్లో కాల్షియం, రోగనిరోధక శక్తిపై ప్రభావం చూపించే 'విటమిన్‌-డి' లోపించినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. 216 మంది కరోనా రోగులను పరీక్షించగా... వీరిలో 80 శాతం మందికి విటమిన్‌-డి లోపం ఉన్నట్లు తేలింది.

ఈ పరిశోధన వివరాలకు సంబంధించి క్లినికల్‌ ఎండోక్రినాలజీ, మెటబాలిజం అనే జర్నల్‌ కథనాన్ని ప్రచురించింది. అయితే కరోనా తీవ్రతకు, విటమిన్-డి లోపానికి మధ్య ఉన్న సంబంధాన్ని ఈ కథనం వెల్లడించలేదు. మహిళల కన్నా పురుష కరోనా రోగుల్లో.. అధికంగా విటమిన్ క్షీణత సమస్య ఉందని తెలిపింది. వృద్ధులు, అప్పటికే వివిధ రకాల ఆరోగ్య సమస్యలు ఉన్న కరోనా రోగుల్లో కూడా ఈ లోపాన్ని గుర్తించినట్లు వెల్లడించింది. ఈ ఇబ్బందులు ఉన్న వారికి రోగనిరోధక శక్తి, కండరాలను పటిష్ఠం చేసుకునేందుకు తగిన చికిత్సను సూచించాలని ప్రతిపాదించింది.

ఇదీ చూడండి:కరోనా రోగులు 'రుచి' కోల్పోయేది అందుకే...

ABOUT THE AUTHOR

...view details