తన 8 శునకాల సహాయంతో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకుంది జర్మనీకి చెందిన 12ఏళ్ల అలెక్సా లాన్బర్గర్. కాంగా అనే నృత్యాన్ని తన కుక్కలకు నేర్పించి "అత్యధిక శునకాలతో కాంగా లైన్" చేసినందుకు ఈ ఘనత సాధించింది.
ఏంటీ కాంగా...?
లాటిన్ అమెరికాకు చెందిన ప్రత్యేక నృత్యం ఈ కాంగా. ఇందులో ఒకరి వెనుక ఒకరు నిలబడతారు. ఈ రికార్డును సాధించడం కోసం... కాంగా వరుసలో మొదటి శునకం(సాలీ) అలెక్సాపై వాలుతూ వెళ్లగా.. మిగిలిన కుక్కలు సాలీని అనుసరించాయి. ఇలా 5మీటర్ల(16అడుగులు 5అంగుళాలు) దూరం ప్రయాణించాయని గిన్నిస్ వరల్డ్ రికార్డ్ న్యాయనిర్ణేతలు తెలిపారు.