తెలంగాణ

telangana

ETV Bharat / international

బెస్ట్​ కార్ ఏదో తెలుసా? - జెనీవా

స్విట్జర్లాండ్​లో జెనీవా ఇంటర్నేషనల్​ మోటార్​ షో మార్చి 7 నుంచి జరగనుంది. అత్యద్భుత కార్ల ప్రదర్శనకు వేదిక కానుంది. ఈ షోకు ముందే... జాగ్వార్ ఐ-పేస్​ను​ ఉత్తమ కారుగా ప్రకటించింది జ్యూరీ.

బెస్ట్​ కార్ ఏదో తెలుసా?

By

Published : Mar 5, 2019, 4:41 PM IST

జెనీవా అంతర్జాతీయ వాహన ప్రదర్శనకు సర్వం సిద్ధమైంది. మార్చి 7 నుంచి 17 వరకు జరగనున్న ఈ కార్యక్రమంలో అత్యాధునిక కార్లు ప్రదర్శించనున్నారు. ఈ నెల 4 నుంచి 7 వరకు విలేకరులు, ప్రముఖులు ఈ ప్రదర్శనలో పాల్గొంటారు. 7 నుంచి 17 వరకు సాధారణ ప్రజలను అనుమతిస్తారు.

జెనీవా అంతర్జాతీయ వాహన ప్రదర్శనకు సర్వం సిద్ధం

ఇదీచూడండి:జంటగా మారిన విజేతలు

ఉత్కం'టై'...

జాగ్వార్​ ఐ-పేస్​ ప్రతిష్టాత్మక 'కార్​ ఆఫ్​ ది ఇయర్'​ అవార్డును గెలుచుకుంది. అయితే 55 ఏళ్ల ఈ అవార్డుల చరిత్రలో మొదటిసారి టై ఏర్పడింది. తుదిదశలో రెండుకార్లు నువ్వానేనా అన్న రీతిలో పోటీపడ్డాయి.

జాగ్వార్​ లాండ్​ రోవర్​ ఎలక్ట్రిక్​ మోడల్​ ఐ-పేస్​, ఆల్పిన్​ ఏ-110 సమాన పాయింట్లతో 'టై' గా నిలిచాయి. తర్వాతి స్థానాల్లో కియా సీడ్​, ఫోర్డ్​ ఫోకస్​ ఉన్నాయి. చివరకు జాగ్వార్​కే జైకొట్టారు న్యాయనిర్ణేతలు.

పురస్కారంపై జాగ్వార్ ప్రతినిధులు హర్షం వ్యక్తంచేశారు. భవిష్యత్​ అంతా ఎలక్టిక్ కార్లదేనని విశ్లేషించారు.

''ఇదో గొప్ప గౌరవంగా భావిస్తున్నా. అందరికీ కృతజ్ఞతలు. విద్యుత్​ కార్లు అవార్డు గెలుచుకోవడం శుభసూచకం. ఇది భవిష్యత్తు తరాన్ని దృష్టిలో పెట్టుకొని రూపొందించింది. అందరూ ఆమోదిస్తేనే మంచిది. ఇలాగే ముందుకు దూసుకెళ్తుంది.''

- జాగ్వార్​ ఐ-పేస్​ డిజైన్​ డైరెక్టర్​ ఇయాన్​ కాలమ్​

బ్రెగ్జిట్​తో తగ్గిన ఆదరణ

బ్రెగ్జిట్​ ఒప్పందం, చైనా కొనుగోళ్ల మందగమనం కార్ల ప్రదర్శనపై పెను ప్రభావం చూపనుంది. చైనాలో డిమాండ్ తగ్గుదల, బ్రెగ్జిట్​ అనిశ్చితి నేపథ్యంలో​ తీవ్ర సంక్షోభంలో చిక్కుకున్న జాగ్వార్​ లాండ్​ రోవర్​ కార్యక్రమానికి హాజరైనా కార్ల ప్రదర్శన నుంచి స్వయంగా తప్పుకుంది. ఆల్పిన్​, ఫోర్డ్​లూ ప్రదర్శనకు ఈసారి దూరంగా ఉన్నాయి.

ఈ మెగా ఈవెంట్​లో 900 పైచిలుకు కార్లను ప్రదర్శించనుండగా, 150 పైన కార్లు ఐరోపా కంపెనీలకు చెందినవే.

వీక్షకుల్ని ఆకట్టుకునేందుకు మేటి కార్లనే ప్రదర్శించాలని చూస్తున్నారు నిర్వాహకులు. దిగ్గజ సంస్థలకు చెందిన ప్రత్యేక మోడళ్లు చూపరుల్ని కట్టిపడేయనున్నాయి. విద్యుత్​ వాహనాలు ఈ ఏడాది ప్రదర్శనలో ప్రత్యేకంగా నిలవనున్నాయి. ఇవి భూతాపం తగ్గిస్తుందనేది అంతర్జాతీయ నిపుణుల సూచన. ఫలితంగా, ఇంధన వాహనాలు వెలవెలబోనున్నాయి.

ఫోక్స్​​వ్యాగన్​ నుంచి బగ్గీ కార్లు...

జర్మనీకి చెందిన ఫోక్స్​వ్యాగన్ దిగ్గజ కారు మోడల్​ను ప్రవేశపెట్టనుంది.​ ఐడీ బగ్గీ(ఓపెన్​టాప్​ కార్​) వివిధ దశల్లో ఐడీ క్రాజ్​, ఐడీ బజ్​, ఐడీ విజియన్​లను ప్రదర్శించనుంది. ఈ కార్లు బీచ్​లలో ప్రయాణానికి అనువుగా రూపొందించారు. హాలిడే వాహనంగా చక్కర్లు కొట్టడానికి ఇది ఉపయోగపడనుంది.

ఫోక్స్​వ్యాగన్​​ ఐడీ బగ్గీని 18 అంగుళాల చక్రాలతో తయారుచేశారు. ఇసుకలో ప్రయాణానికి ఉత్తమమైన మార్గమిదే. ఇద్దరు కూర్చోవడానికి వీలుంటుంది. బగ్గీ మోడల్​తో ఫోక్స్​వ్యాగన్​కు సుదీర్ఘ చరిత్ర ఉంది.

ABOUT THE AUTHOR

...view details