తెలంగాణ

telangana

ETV Bharat / international

'58% యువతులకు ఆన్​లైన్​ వేధింపులు' - బాలికలకు వేధింపులు

ప్రపంచవ్యాప్తంగా 58 శాతం మంది బాలికలు, యువతులు ఆన్​లైన్​లో వేధింపులకు గురవుతున్నారని ఓ అంతర్జాతీయ సర్వే ద్వారా తెలిసింది. బాలికలు, యువతులే ప్రధాన లక్ష్యంగా ఆన్​లైన్​ వేధింపులు, బెదిరింపులకు పాల్పడుతున్నారని వెల్లడైంది.

teasing
వేధింపులు

By

Published : Oct 6, 2020, 7:28 PM IST

బాలికలు, యువతులే ప్రధాన లక్ష్యంగా ఆన్​లైన్​ వేధింపులు, బెదిరింపులకు పాల్పడుతున్నారని బ్రిటన్​కు చెందిన 'ప్లాన్ ఇంటర్నేషనల్' సర్వే వెల్లడించింది. ప్రపంచ బాలికల దినోత్సవానికి ముందు ఈ సర్వే ఫలితాలను విడుదల చేసింది సంస్థ.

భారత్, అమెరికా తదితర 22 దేశాల్లో నిర్వహించిన ఈ సర్వేలో 15-25 మధ్య వయసున్న 14 వేల మంది పాల్గొన్నారు. 'స్టేట్ ఆఫ్​ ద వరల్డ్ గర్ల్స్ రిపోర్ట్​' పేరుతో విడుదలైన ఈ నివేదిక ద్వారా లైంగిక బెదిరింపులు, జాత్యహంకార వ్యాఖ్యలు.. ఇలా వేర్వేరు మార్గాల్లో యువతులపై దాడులు జరుగుతున్నట్లు స్పష్టమైంది.

సామాజిక మాధ్యమాల్లో..

సర్వేలో పాల్గొన్నవారిలో 58 శాతం మంది ఫేస్​బుక్​, ఇన్​స్టాగ్రామ్​, ట్విట్టర్​, వాట్సాప్​, టిక్​టాక్​ వంటి మాధ్యమాల్లో వేధింపులకు గురైనట్లు అంగీకరించారు. అన్ని దేశాల్లోనూ వీరి శాతం దాదాపు సమానంగా ఉంది.

ఇది ఐరోపాలో 63 శాతం, లాటిన్ అమెరికాలో 60 శాతం, ఆసియా-పసిఫిక్​లో 58 శాతం, ఆఫ్రికాలో 54 శాతం, ఉత్తర అమెరికాలో 52 శాతంగా ఉంది.

నివేదికలోని అంశాలు..

  • భౌతిక లేదా లైంగిక హింసకు సంబంధించిన బెదిరింపులు 47 శాతం మందికి వచ్చాయి.
  • అసభ్య పదజాలం, దూషణలను ఎదుర్కొన్నవారు 59 శాతం మంది ఉన్నారు.
  • మైనారిటీ, ఎల్‌జీబీటీక్యూ వర్గాలకు చెందిన యువతులు చాలా మంది.. తమ గుర్తింపు కారణంగా వేధింపులు ఎదుర్కొన్నట్లు చెప్పారు. ఎల్​జీబీటీక్యూలో 42 శాతం, మైనారిటీల్లో 37 శాతం మంది బాధితులు ఉన్నారు.
  • ప్రస్తుత, మాజీ భాగస్వాములతో 11 శాతం, స్నేహితులతో 23 శాతం వేధింపులు ఎదుర్కొన్నారు.

ఇదీ చూడండి:అమ్మాయి.. గుర్రంలా గంతులేస్తోంది!

ABOUT THE AUTHOR

...view details