ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్‌లో దుండగులు కత్తితో దాడికి పాల్పడ్డారు. వ్యంగ్య వార్తా పత్రిక చార్లీ హెబ్డో పాత కార్యాలయం సమీపంలో జరిగిన ఈ ఘటనలో నలుగురికి గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. దాడికి పాల్పడ్డ దుండగులు పరారీలో ఉన్నట్లు ప్యారిస్ పోలీసులు తెలిపారు.
ఈ దాడికి అసలు కారణం ఏమిటనేది తెలియలేదు. చార్లీ హెబ్డో పత్రిక ఉద్యుగులే లక్ష్యంగా ఈ దాడి జరిగిందా అనే విషయంపైనా స్పష్టతలేదు.