పశ్చిమ జర్మనీలో ఓ చిన్న సైజు విమానం ప్రమాదవశాత్తు ఇంటిపై కుప్పకూలింది. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఓ చిన్నారికి స్వల్ప గాయాలయ్యాయి.
ఇంటిపై కుప్పకూలిన విమానం.. ముగ్గురు మృతి - plane crash news latest
పశ్చిమ జర్మనీలో చిన్న విమానం ప్రమాదానికి గురైంది. అదుపుతప్పి ఓ ఇంటిపై కుప్పకూలింది ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఓ చిన్నారికి గాయాలయ్యాయి.
ఇంటిపై కూలిన విమానం..ముగ్గరు మృతి
వీసెల్ పట్టణంలో విమానం అదుపుతప్పి ఓ ఇంటిపైకి దూసుకెళ్లినట్లు స్థానిక అధికారులు తెలిపారు. ఈ ధాటికి ఇంటి పైకప్పు కూలి మంటలు చెలరేగినట్లు వెల్లడించారు. విమానానికి ఇద్దరిని మాత్రమే తీసుకెళ్లే సామర్థ్యం ఉందని చెప్పారు. అయితే లోపల ఎంతమంది ఉన్నారో తెలియలేదన్నారు. మరణించిన ముగ్గురు ఎవరో ఇంకా గుర్తించాల్సి ఉందన్నారు.