ఈ ఏడాది రసాయన శాస్త్రంలో(nobel prize 2021 chemistry) బెంజమిన్ లిస్ట్(జర్మనీ), డేవిడ్ డబ్ల్యూసీ మెక్‌మిలన్‌కు(స్కాట్లాండ్) నోబెల్ పురస్కారం దక్కింది.
అణు నిర్మాణానికి ఉపయోగపడే అసిమెట్రిక్ ఆర్గానోకెటాలిసిస్ అభివృద్ధికి దోహదం చేసినందుకు ఈ ఇద్దరినీ పురస్కారం వరించింది. ఇన్నేళ్లుగా శాస్త్రవేత్తలు లోహాలు, ఎంజైమ్‌లు అనే రెండు రకాల ఉత్ప్రేరకాలు మాత్రమే ఉన్నాయని విశ్వసించారు. కానీ ఈ నోబెల్ పురస్కార గ్రహీతలు మూడో రకం కూడా ఉంటుందని, అసిమెట్రిక్ ఆర్గానోకెటాలిసిస్ను అభివృద్ధి చేసి రుజువు చేశారు.
రసాయన శాస్త్రంలో నోబెల్ వీరికే.. ఈ పరిశోధన పరమాణు నిర్మాణంలో కొత్త స్థాయికి తీసుకెళ్లింది. ఇది అసమాన అణువులను ఉత్పత్తి చేయడాన్ని మరింత సులభతరం చేస్తుంది.
వీరికి బంగారు పతకం, 11లక్షల డాలర్ల నగదు అందజేయనుంది రాయల్ స్వీడిష్ అకాడమీ. ఆ మొత్తాన్ని ఇద్దరికీ సమంగా పంచనుంది.
వైద్యం, భౌతిక, రసాయన, సాహిత్యం, శాంతి, అర్థశాస్త్రాలు వంటి ఆరు విభాగాల్లో అందించే నోబెల్ పురస్కారాల్లో ఇది మూడోది(nobel prize 2021 chemistry). సొమవారం.. వైద్య శాస్త్రంలో (nobel prize medicine 2021) నోబెల్ బహుమతిని ప్రకటించగా.. అమెరికన్ శాస్త్రవేత్తలు డేవిడ్ జూలియస్, ఆర్డెమ్ పటపౌటియన్‌లు ఈ పురస్కారాన్ని దక్కించుకున్నారు.
భౌతిక శాస్త్రంలో(nobel prize 2021 physics) నోబెల్‌ను మంగళవారం ప్రకటించగా.. సుకురో మనాబే, క్లాస్ హాసిల్మేన్, జార్జియో పారిసీ దీనిని దక్కించుకున్నారు.
అక్టోబర్ 7న సాహిత్యం, అక్టోబర్ 8న శాంతి బహుమతి, అక్టోబర్ 11న చివరగా ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతులను ప్రకటించనుంది రాయల్ స్వీడిష్ అకాడమీ.
ఇవీ చూడండి: డేవిడ్-ఆర్డెమ్కు వైద్య శాస్త్రంలో నోబెల్ బహుమతి
భూతాపంపై పరిశోధనలు చేసిన వారికి నోబెల్