సముద్రంలో పడవ మునిగి 20మంది మృతి - టునీసియాలో పడవ ప్రమాదం
18:05 December 24
సముద్రంలో పడవ మునిగి 20మంది మృతి
మధ్యదరా సముద్రంలో పడవ మునిగిపోయి 20 మంది ఆఫ్రికన్ వలదారులు మృతి చెందారు. మరో 20 మంది వరకు ఆచూకీ గల్లంతైంది. ఐదుగురిని సురక్షితంగా రక్షించినట్లు టునీసియా అధికారులు తెలిపారు.
టునీసియాలోని తీర ప్రాంత నగరం స్ఫాక్స్కు సమీపంలో సముద్రంలో కోస్ట్‌గార్డ్ బృందాలు, స్థానిక మత్య్సకారులు మృతదేహాలను గుర్తించినట్లు.. ఆ దేశ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మొహమ్మద్ బెన్ జెక్రీ తెలిపారు. ప్రమాదం జరిగే సమయానికి బోటులో 50 మంది వరకు ఉంటారని తెలిసిందన్నారు. వారంతా స్మగ్లింగ్ గూడ్స్‌తో ఇటలీకి వెళుతుండగా ప్రమాదం జరిగినట్లు చెప్పారు.
ఆచూకీ గల్లంతైన వారి కోసం టునీసియా నావికాదళం గాలింపు చర్యలు చేపట్టింది.