తెలంగాణ

telangana

ETV Bharat / international

గ్రీస్​లో భూప్రకంపనలు- హడలెత్తిన జనం! - గ్రీస్ భూకంపం న్యూస్

గ్రీస్​లోని క్రీట్ ఐలాండ్​లో పలుమార్లు భూమి కంపించింది. కొద్ది సమయం వ్యవధిలో రెండు సార్లు భూకంపం వచ్చినట్లు ఎథెన్స్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్​ జియోడైనమిక్స్​ వెల్లడించింది.

earthquake
భూకంపం

By

Published : Dec 27, 2021, 4:59 AM IST

గ్రీస్​లో పలుమార్లు భూమి కంపించింది. వరుసగా రెండుసార్లు భూకంపం సంభవించడం వల్ల ప్రజలు భయబ్రాంతులకు గురయ్యారు.

తొలుత 5.2 తీవ్రతతో గ్రీస్​లోనే క్రీట్ ఐలాండ్​లో భూకంపం సంభవించింది. దీంతో కార్పథోస్, కాసోస్, రోడ్స్​ ప్రాంతాల్లోనూ భూమి కంపించినట్లు ఎథెన్స్​లోని ఇనిస్టిట్యూట్​ ఆఫ్ జియోడైనమిక్స్​ పేర్కొంది. కొద్ది సమయం తర్వాత 5.4 తీవ్రతతో మరో భూకంపం సంభవించినట్లు స్పష్టం చేసింది.

వరుస భూకంపాల్లో ఎలాంటి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగలేదు.

యూకేలో..

మరోవైపు.. బ్రిటన్​లోని సౌత్​ సాండ్​విచ్ ఐలాండ్​లో 5.1 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది.

ఇదీ చదవండి:

Suicide Bomb Blast: కాంగోలో ఆత్మాహుతి దాడి- ఆరుగురు మృతి

సముద్రం ఒడ్డుకు కొట్టుకువచ్చిన 27 మృతదేహాలు

ABOUT THE AUTHOR

...view details