తెలంగాణ

telangana

ETV Bharat / international

113 ఏళ్ల వయసులో కరోనాను కసితీరా ఓడించి!

ఆమె వయసు 113 ఏళ్లు. అయితేనేం, మనోస్థైర్యానికి వయసుతో సంబంధమేంటి అంటున్నారు. వందేళ్ల కింద విజృంభించిన స్పానిష్​ ఫ్లూను ఆమె జయించారు. ఇప్పుడు పదకొండు పదుల వయసులో కరోనాను ఓడించి.. కొవిడ్​ కోరల నుంచి విముక్తి పొందిన అతి పెద్ద వయస్కురాలిగా పేరుగాంచారు.

113 YEARS LADY DEFEATED COVID 19 IN SPAIN
113 ఏళ్ల వయసులో కరోనాను మట్టుబెట్టింది!

By

Published : May 13, 2020, 8:35 AM IST

స్పెయిన్‌కు చెందిన 113 ఏళ్ల మరియా బ్రన్యాస్‌ అనే వృద్ధురాలు కరోనా నుంచి బతికి బయటపడ్డారు. మహమ్మారి నుంచి కోలుకున్న వారిలో ఈమె ప్రపంచంలోనే అతి పెద్ద వయస్కురాలు. మరియాకు ఏప్రిల్‌లో కరోనా సోకింది. ఓల్డేజ్‌ కేర్‌ హోంలోని తన గదిలో ఐసోలేషన్‌లో ఉంటూ ఆమె వైరస్‌పై పోరాడారు.

వందేళ్ల కింద స్పానిష్​ ఫ్లూను జయించి..

"ప్రస్తుతం నా ఆరోగ్యం ఎంతో బాగుంది. చిన్నపాటి ఒళ్లు నొప్పులున్నాయి. ఇవి అందరూ ఎదుర్కొనేవే" అని సంతోషం వెలిబుచ్చారు. మరియా అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోకు చెందిన వారు. స్పెయిన్‌లో స్థిరపడ్డారు. 1918-19లో విజృంభించిన స్పానిష్‌ ఫ్లూ నుంచీ ఈమె గట్టెక్కడం గమనార్హం.

రెండు ప్రపంచ యుద్ధాలు సహా 1936-39 మధ్య జరిగిన స్పానిష్‌ అంతర్యుద్ధాన్నీ మరియా చూశారు. స్పెయిన్‌కు చెందిన వృద్ధాప్య పరిశోధన సంస్థ ఆమెను దేశంలోకెల్లా పెద్ద వయస్కురాలిగా గుర్తించింది. మరియాకంటే ముందు ఈ దేశానికే చెందిన అనా దెల్‌ వాల్లె అనే 106 ఏళ్ల మహిళ కరోనా నుంచి కోలుకున్న అతిపెద్ద వయస్కురాలిగా గుర్తింపు పొందారు. ఇప్పుడా రికార్డు చెరిగిపోయింది.

ఇదీ చదవండి:కరోనా తెచ్చే మార్పులు- ఇక మన లైఫ్​స్టైలే వేరు!

ABOUT THE AUTHOR

...view details