మానవుని ఆయుః ప్రమాణం నానాటికీ తగ్గిపోతున్న వేళ వందేళ్లకు పైగా జీవించి రికార్డులు నెలకొల్పుతున్నారు కొందరు వ్యక్తులు. కొద్దిరోజుల క్రితమే అత్యధిక కాలం జీవించి ఉన్న వ్యక్తిగా జపాన్‌కు చెందిన చిటేషు వాటనేబ్ (112) గిన్నిస్ రికార్డు సృష్టించారు. ఆయన అనారోగ్యంతో మృతి చెందినందున.. ఆ రికార్డు ఓ బ్రిటన్ వ్యక్తి అందుకోనున్నాడు.
మార్చి 29తో 112 ఏళ్లు...
112 ఏళ్ల వాటనేబ్ తర్వాత అతి పెద్ద వయస్కుడు బ్రిటన్‌వాసి బాబ్ వెయిటన్. ఈయన వయసు 111 ఏళ్లు. 1908 మార్చి 29న జన్మించిన వెయిటన్ ప్రపంచ కురువృద్ధుడిగా రికార్డు నెలకొల్పనున్నట్లు తెలుస్తోంది. ఈయన వచ్చే నెలలో 112 వ పడిలోకి అడుగుపెట్టనున్నారు. దానికి సంబంధించి ధ్రువీకరణ పత్రం కూడా పొందనున్నట్లు సమాచారం.
ఇంజనీర్ వృత్తిని చేపట్టిన వెయిటన్.. తైవాన్, జపాన్, కెనడా వంటి దేశాల్లోనూ జీవనం సాగించారు. ప్రస్తుతం బ్రిటన్ ఆల్టన్లోని ఓ ఫ్లాట్‌లో నివసిస్తున్నారు.