కరోనా విజృంభణతో చాలా రంగాలు తీవ్రంగా నష్టపోయాయి. అందులో హోటళ్లు, రెస్టారెంట్ల వ్యాపారాలు కూడా ముఖ్యమైనవి. ఇవి ఇప్పుడిప్పుడే తెరుచుకుంటున్నా.. వినియోగదారులు మాత్రం అంతంత మాత్రంగానే వస్తున్నారు. అయితే రెస్టారెంట్లకు ప్రజలను రప్పించేందుకు బ్రిటన్ ఓ కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది.
అదే "ఈట్ ఔట్ హెల్ప్ఔట్". ఈ ఆఫర్ ప్రవేశపెట్టిన తర్వాత ప్రజలు కేవలం ఆగస్టు నెలలో 10 కోట్ల డిస్కౌంట్ డైనింగ్లు చేశారు. బ్రిటన్ ట్రెజరీ విభాగం ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ ఆఫర్‌ను వినియోగించుకునేందుకు సెప్టెంబర్ చివరి వరకు గడువు ఉంది. అయితే ఇప్పటికే ఈ ఆఫర్ దెబ్బకు తమ అంచనాలు దాటేసినట్లు పేర్కొంది ట్రెజరీ విభాగం.
ఇంతకీ ఏమిటి ఈ ఆఫర్..
"ఈట్ ఔట్ హెల్ప్ ఔట్" పథకం కింద ప్రజలు రెస్టారెంట్లలో భోజనం చేయడం ద్వారా.. ఫుడ్, నాన్ ఆల్కహాలిక్ డ్రింక్స్‌పై 50 శాతం (దాదాపు 10 ఫౌండ్లు )వరకు ప్రభుత్వం నుంచి డిస్కౌంట్ పొందొచ్చు. సోమవారం నుంచి బుధవారం మధ్య ఈ డిస్కౌంట్ అందుబాటులో ఉంటుంది.
మిషెలిన్ స్టార్ ఔట్లెట్లు మొదలుకొని.. అంతర్జాతీయ బర్గర్ ఫ్రాంఛైజీల్లో చేసే డైనింగ్ల వరకు ఈ ఆఫర్ వర్తిస్తుంది. డైనింగ్ చేసిన 5 రోజుల్లో ప్రభుత్వం నుంచి రీఫండ్ లభిస్తుంది. అయితే ఈ ఆఫర్‌కు ఆగస్టు చివరి నాటికి 500 మిలియన్ పౌండ్లు ఖర్చు అవుతుందని అంచనా వేసినప్పటికీ.. 22 మిలియన్ పౌండ్ల భారం అధికంగా పడినట్లు బ్రిటన్ ట్రెజరీ విభాగం పేర్కొంది.