దేశంలో కరోనా విజృంభిస్తున్న వేళ భారత్ నుంచి వెళ్లే ప్రయాణికులపై ఫ్రాన్స్ ఆంక్షలు విధించనుంది. ఇక్కడి నుంచి వెళ్లే ప్రయాణికులు 10 రోజుల క్వారంటైన్ ఉండేలా చర్యలు తీసుకోనుంది. ఈ విషయాన్ని ఫ్రాన్స్ ప్రభుత్వ అధికారప్రతినిధి గాబ్రియేల్ అట్టల్ వెల్లడించారు. కేబినెట్ సమావేశం అనంతరం ఆయన ఈ విషయాన్ని తెలిపారు.
ఆరోగ్య పరిస్థితులు సీరియస్‌గా, ఆందోళనకరంగా ఉన్న కొన్ని దేశాలకు సంబంధించి మరోసారి ఆంక్షలు కఠినతరం చేస్తున్నట్టు మంత్రి చెప్పారు. ఈ జాబితాలో భారత్‌ను కూడా చేరుస్తామన్నారు. ప్రయాణాలపై ఆంక్షలకు సంబంధించి త్వరలోనే వివరాలు వెల్లడిస్తామని తెలిపారు.