ఇంగ్లాండ్‌లోని నైరుతి నగరమైన బ్రిస్టల్‌లో యాంటీ లాక్డౌన్ కూటమిగా ఏర్పడిన కొందరు 'కిల్ ది బిల్' పేరిట చేపట్టిన ఆందోళన హింసాయుతంగా మారింది. పోలీసు అధికారులపై కోడిగుడ్లు, ఇటుకలు, గ్లాస్ బాటిళ్లు విసరడంతో పదిమంది ఆందోళనకారులను బ్రిటిష్ పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం సాయంత్రం జరిగిన ఈ సంఘటనల తర్వాత పోలీసులు, ఆందోళనకారుల నడుమ ప్రతిష్టంభన ఏర్పడింది.
లాక్డౌన్ వద్దంటూ బ్రిటన్‌లో హింస - బ్రిటన్‌లో యాంటీ లాక్డౌన్
బ్రిటన్‌లో లాక్డౌన్ విధించొద్దంటూ చేపట్టిన ఆందోళన హింసాత్మకంగా మారింది. నిరసనకారులు పోలీసులపై కోడిగుడ్లు, ఇటుకలు, బాటిళ్లు రువ్వారు. ఈ ఘటనను యూకే ప్రధానమంత్రి బొరిస్ జాన్సన్, హోం మంత్రి ప్రీతి పటేల్ ఖండించారు.
లాక్డౌన్ వద్దంటూ బ్రిటన్‌లో హింస
పోలీసులు గుర్రాలపై తిరుగుతూ లౌడ్ స్పీకర్లతో పలుమార్లు హెచ్చరించిన తర్వాత మూకలను చెదరగొట్టారు. పోలీసు అధికారులను లక్ష్యంగా చేసుకుని నిరసనకారులు దాడి చేయడాన్ని యూకే ప్రధానమంత్రి బొరిస్ జాన్సన్, హోం మంత్రి ప్రీతి పటేల్ ఖండించారు.
ఇదీ చూడండి:ఈజిప్టులో కూలిన భవనం- 18 మంది మృతి