తెలంగాణ

telangana

By

Published : Mar 22, 2022, 7:01 AM IST

ETV Bharat / international

'ఇమ్రాన్​ఖాన్ ఆట ముగిసింది.. అతడే పాక్​ కొత్త ప్రధాని!'

Maryam Nawaz to Imran Khan: పాకిస్థాన్​ ప్రధాని ఇమ్రాన్​ ఖాన్ ఆట ముగిసిందని చెప్పారు పాకిస్థాన్‌ ముస్లిం లీగ్‌ (పీఎంఎల్‌) నేత మర్యమ్‌ నవాజ్‌. ఇమ్రాన్​పై ప్రతిపాదిత అవిశ్వాస తీర్మానం ఆమోదం పొందితే పీఎంఎల్‌ తరఫున షెహ్‌బాజ్‌ షరీఫ్‌ ప్రధాని అభ్యర్థిగా నిలవనున్నట్లు తెలిపారు.

imran khan
Maryam Nawaz

Maryam Nawaz to Imran Khan: పాకిస్థాన్‌ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌పై ప్రతిపాదిత అవిశ్వాస తీర్మానం ఆమోదం పొందితే.. పాకిస్థాన్‌ ముస్లిం లీగ్‌- నవాజ్‌ (పీఎంఎల్‌-ఎన్‌) పార్టీ తరఫున షెహ్‌బాజ్‌ షరీఫ్‌ ప్రధాని అభ్యర్థిగా నిలవనున్నారు. పార్టీ ఉపాధ్యక్షురాలు, పాక్‌ మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ కుమార్తె మర్యమ్‌ నవాజ్‌ ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రధానిగా ఇమ్రాన్‌ ఆట ముగిసిందని ఆమె ఎద్దేవా చేశారు. ఇస్లామాబాద్‌ హైకోర్టు వెలుపల సోమవారం ఆమె విలేకర్లతో ఈ మేరకు మాట్లాడారు. ఇమ్రాన్‌కు వ్యతిరేకంగా పీఎంఎల్‌-ఎన్‌, పాకిస్థాన్‌ పీపుల్స్‌ పార్టీ (పీపీపీ)లకు చెందిన దాదాపు 100 మంది చట్టసభ్యులు జాతీయ అసెంబ్లీలో ఇటీవలే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు.

మర్యమ్‌ నవాజ్‌

సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఇమ్రాన్‌ సర్కారు

అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటేస్తామంటూ ఇటీవల హెచ్చరించిన స్వపక్ష అసమ్మతి నేతలపై (దాదాపు రెండు డజన్ల మంది) అనర్హత ఓటు వేసే విషయంపై ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ నేతృత్వంలోని తెహ్రీక్‌-ఎ-ఇన్సాఫ్‌ ప్రభుత్వం సుప్రీంకోర్టు అభిప్రాయం కోరింది. అటార్నీ జనరల్‌ ఖాలీద్‌ జావెద్‌ ఖాన్‌ ఈ మేరకు ఓ పిటిషన్‌ దాఖలు చేశారు. దానిపై విచారణ చేపట్టేందుకు ఐదుగురు సభ్యుల విస్తృత ధర్మాసనాన్ని ఏర్పాటు చేయాలని కోర్టు నిర్ణయించింది. తదుపరి విచారణను ఈ నెల 24కు వాయిదా వేసింది.

ఇదీ చూడండి:ఆరోజే తేలనున్న ఇమ్రాన్​ఖాన్​ భవితవ్యం.. రెబల్స్​కు పాక్​ ప్రధాని ఆఫర్​!

ABOUT THE AUTHOR

...view details