తెలంగాణ

telangana

ETV Bharat / international

జపాన్​ ప్రధానిగా 'యోషిహిడే సుగా' ఎంపిక - Japan prime minister

షింజో అబే వారసుడిగా, జపాన్​ తదుపరి ప్రధానిగా యోషిహిడే సుగాను ఎన్నుకుంది అధికార లిబరల్​ డెమొక్రటిక్​ పార్టీ. సుగాకే భారీ సంఖ్యలో మద్దతు పలికారు పార్టీ నేతలు.

Yoshihide Suga
జపాన్​ ప్రధానిగా 'యోషిహిడే సుగా' ఎన్నిక!

By

Published : Sep 14, 2020, 1:39 PM IST

జపాన్​ తదుపరి ప్రధానమంత్రిగా చీఫ్‌ కేబినెట్‌ సెక్రటరీ యోషిహిడే సుగాకే మద్దతు పలికారు అధికార లిబరల్​ డెమొక్రటిక్​ పార్టీ నేతలు. ముందు నుంచి అనుకుంటున్నట్లు షింజో అబే వారసుడిగా సుగాకే పట్టం కట్టారు. పార్టీలో అంతర్గతంగా జరిగిన ఓటింగ్​లో సుగాను భారీ మెజారిటీతో ఎన్నుకున్నారు.

ప్రధాని కోసం సోమవారం జరిగిన ఈ ఓటింగ్​లో యోషిహిడే సుగాకు 377 ఓట్లు వచ్చాయి. ప్రధాని పదవి కోసం పోటీ పడిన ప్రత్యర్థులు ఇరువురికి కలిపి 157 ఓట్లు మాత్రమే రావటం గమనార్హం.

షింజో అబేకు అత్యంత సన్నిహితుడిగానే కాదు, పాలసీ కోఆర్డినేటర్​గా, శక్తిమంతమైన నేతగా ఎదిగారు సుగా. అబే విధానాలను ముందుకు తీసుకెళతారని పార్టీతో పాటు దేశ ప్రజల్లోనూ ఆయనపై నమ్మకం ఉంది.

ఈ సందర్భంగా.. తాను సంస్కరణవాదినని, అధికార యంత్రాంగంలోని అడ్డంకులను అధిగమించి పలు రంగాల్లో సంస్కరణలు చేసినట్లు చెప్పారు యోషిహిడే సుగా. జపాన్​ పర్యటక అభివృద్ధి, సెల్​ఫోన్​ బిల్లుల తగ్గింపు, వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు పెంచేందుకు కృషి చేశానన్నారు.

ఇదీ చూడండి: భారత్‌కు అబె... ఓ మంచి నేస్తం!

అనారోగ్య కారణాలతో జపాన్​ ప్రధాని రాజీనామా

ABOUT THE AUTHOR

...view details