మీరు స్మార్ట్‌ఫోన్ వాడుతున్నారా! త్వరగా ఛార్జింగ్ అయిపోతుందని బాధపడుతున్నారా! అయితే.. ఇది మీకోసమే. ఈ సమస్యకు పరిష్కారం ఆలోచించింది షియోమీ సంస్థ. ఇక ఛార్జింగ్ కోసం గంటల తరబడి ఓపిగ్గా ఎదురుచూడాల్సిన అవసరం లేదు. కేవలం 10 నిమిషాల్లోనే 50 శాతం ఛార్జింగ్ ఎక్కే సామర్థ్యం గల ఛార్జర్‌ను అందుబాటులోకి తీసుకొస్తుందీ సంస్థ.
ఇకపై 17 నిమిషాల్లోనే మీ ఫోన్ బ్యాటరీ ఫుల్!
మీరు స్మార్ట్‌ఫోన్ వాడుతున్నారా! త్వరగా ఛార్జింగ్ అయిపోతుందని బాధపడుతున్నారా! తిరిగి ఫుల్ ఛార్జింగ్ చేయాలంటే వేచిచూడలేక అసహనానికి గురవుతున్నారా! అయితే.. ఇది మీకోసమే. ఈ సమస్యకు పరిష్కారం ఆలోచించింది షియోమీ సంస్థ. కేవలం 17 నిమిషాల్లోనే బ్యాటరీ ఫుల్ చేసే ఛార్జర్‌ను అందుబాటులోకి తెస్తుంది.
ఫోన్లో ముఖ్యమైన పని చేస్తున్నప్పుడు ఛార్జింగ్ అయిపోవడం సాధారణం. 100 వాట్ల సామర్థ్యం గల ఛార్జర్‌తో 4000 ఎమ్ఏహెచ్ బ్యాటరీలో కేవలం 7 నిమిషాల్లోనే 0 నుంచి 50 శాతం ఛార్జింగ్ ఎక్కుతుంది. మిగతా భాగం పూర్తవడానికి మరో 10నిమిషాల సమయం పడుతుందంతే!
మిగతా వాటితో పోలిస్తే షియోమీ ఛార్జర్‌తో రెండు రెట్లు వేగంగా ఛార్జింగ్ ఎక్కుతుంది. త్వరలో మార్కెట్లోకి విడుదల చేయనుంది. ఇంకా ఉత్పత్తి ప్రారంభం కాని ఈ ఛార్జర్‌తో భవిష్యత్తులో వినియోగదారులు ఛార్జర్‌ను వెంట తీసుకెళ్లే అవసరం రాదని ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు.