కరోనా వ్యాక్సిన్ అభివృద్ధిలో భారత్‌తో పాటు ఇతర బ్రిక్స్ సభ్య దేశాలకు సహకారం అందిస్తామని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఉద్ఘాటించారు. 12వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్న జిన్‌పింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు.
"వ్యాక్సిన్ మూడో దశ ట్రయల్స్‌కు సంబంధించి రష్యా, బ్రెజిల్‌తో చైనా కంపెనీలు కలిసి పనిచేస్తున్నాయి. దక్షిణాఫ్రికా, భారత్‌తోనూ సహకారం ఏర్పరచుకునేందుకు ప్రణాళికలు రచిస్తున్నాం. కోవాక్స్ బృందంలో చైనా చేరింది. అవసరమైనప్పుడు బ్రిక్స్ సభ్య దేశాలకు వ్యాక్సిన్ అందించే విషయాన్ని చైనా పరిశీలిస్తోంది."
-- జిన్‌పింగ్, చైనా అధ్యక్షుడు.
అంతర్జాతీయ వ్యాక్సిన్ కూటమి గావి, ప్రపంచ ఆరోగ్య సంస్థ నేతృత్వం వహిస్తున్న బృందమే ఈ కోవాక్స్. టీకా అభివృద్ధి, తయారీని వేగవంతం చేయడమే దీని లక్ష్యం.