అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దు సమీపంలో టిబెట్‌లోని న్యింగ్చీ పట్టణంలో చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ పర్యటించారు. వ్యూహాత్మకంగా కీలకమైన ఈ ప్రాంతాన్ని ఇప్పటివరకు చైనా నాయకులు మాత్రమే సందర్శించారు. అనూహ్యంగా ఇప్పుడు జిన్‌పింగ్ ఇక్కడ పర్యటించడం చర్చనీయాంశమైంది.
బుధవారం ఉదయం న్యింగ్చీ చేరుకున్న జిన్‌పింగ్‌కు స్థానిక ప్రజలు, సంప్రదాయ తెగలు, అధికారులు సాదర స్వాగతం పలికినట్లు జినువా వార్తా సంస్థ పేర్కొంది.
పర్యటనలో భాగంగా న్యాంగ్ నది వంతెనను జిన్‌పింగ్ సందర్శించారు. బ్రహ్మపుత్ర నది పరివాహక ప్రాంతంలో పర్యవరణ పరిరక్షణను పరిశీలించారు.