అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన జో బైడెన్‌కు శుభాకాంక్షలు తెలిపారు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్. ఘర్షణలకు దిగకుండా.. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి ఇరు దేశాలు కృషి చేస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ మేరకు బైడెన్‌కు సందేశం పంపారు.
"ఘర్షణలకు దిగకుండా, ఒకరినొకరు ఎదిరించుకోకుండా, పరస్పర గౌరవంతో, గెలుపే లక్ష్యంగా సహకరించుకుని, ఆరోగ్యవంతమైన, స్థిరమైన చైనా- అమెరికా బంధం కోసం ఆశిస్తున్నా. ఇతర దేశాలతో చేతులు కలిపి, అంతర్జాతీయ సంఘంలో ప్రపంచ శాంతిని ప్రచారం చేసేందుకు ఇరు దేశాలు కృషి చేయాలి."