china recruitment for military: భవిష్యత్తులో యుద్ధాలను ఎదుర్కొనేందుకు.. మిలిటరీ అవసరాలను దృష్టిలో ఉంచుకొని సైన్యాన్ని మరింత పెంచాలని భావిస్తున్నారు చైనా అధ్యక్షుడు జింగ్ పింగ్. ఇందుకోసం ప్రతిభావంతులైన 3 లక్షల మందిని కొత్తగా సైన్యంలో నియమించాలని ఆర్మీ (Chinese military recruitment ) అధికారులకు సూచించారు.
చైనా సాయుధ దళాలను మరింత పటిష్ఠం చేయడం సహా భవిష్యత్తులో జరిగే యుద్ధాల్లో పై చేయి సాధించడానికి నైపుణ్యం చాలా అవసరమని ఇటీవలే జరిగిన ఓ సైనిక సమావేశంలో జిన్పింగ్ పేర్కొన్నారు. ఇందుకుగాను నైపుణ్యం ఉన్న మరింత మందిని సైన్యంలోకి తీసుకోవాలని అధ్యక్షుడు పిలుపునిచ్చారు. 2027లో జరగనున్న పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్‌ఏ) శతాబ్ది ఉత్సవాల సందర్భంగా నిర్దేశించుకున్న లక్ష్యాల సాకారానికి కొత్త ప్రతిభ అవసరమని జింగ్ పింగ్ అధికారులకు చెప్పినట్లు అక్కడి మీడియా తెలిపింది. గొప్ప ప్రయత్నాలు చేసి.. మెరుగైన సైనిక పాఠశాలల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని జిన్పింగ్ ఆదేసించినట్టు స్పష్టం చేసింది.