తమపై వస్తున్న ఆరోపణలను చైనాలోని వుహాన్ వైరాలజీ ల్యాబ్ ఖండించింది. ప్రాణాంతక మహమ్మరి కరోనా వైరస్ వంటి వైరస్‌లను రూపొందించే శక్తి మనుషులకు లేదని తెలిపింది.
వైరస్‌కు పుట్టినిల్లు అయిన వుహాన్‌లో వైరాలజీ ల్యాబ్ ఉండటం, దాని సమీపంలోనే వైరస్‌ను తొలిసారి గుర్తించిన మార్కెట్ ఉండటం తీవ్ర అనుమానాలకు దారి తీశాయి. కరోనా వైరస్ అదే ల్యాబ్ నుంచి తప్పించుకుందన్న నివేదికలను పరిశీలిస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు ప్రకటించడం ఈ ఊహాగానాలను మరింత పెంచాయి.
ఈ నేపథ్యంలో వైరాలజీ ల్యాబొరేటరీ డైరక్టర్ యువాన్ జిమింగ్ తొలిసారి మీడియా సమావేశం నిర్వహించారు. తాము ఎలాంటి వైరస్‌లపై పరిశోధనలు చేస్తామో తమకు తెలుసని.. ఇలాంటి వైరస్ తమ నుంచి బయటకు రాలేదని ధీమా వ్యక్తం చేశారు.
ప్రపంచం గడ్డుపరిస్థితులను ఎదుర్కొంటున్న సమయంలో అమెరికా ఇలాంటి ఆరోపణలు చేసి.. ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నించడం దురదృష్టకరమన్నారు యువాన్.