తెలంగాణ

telangana

ETV Bharat / international

కోటి మందిలో 300 దొంగ కరోనా కేసులు! - వుహాన్​లో కరోనా కేసులు

చైనాలోని వుహాన్​లో సామూహికంగా 10 మిలియన్ల మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 300 మందికి లక్షణాలు లేకుండానే వైరస్​ నిర్ధరణ అయింది. ఈ విషయాన్ని చైనా అధికారులు వెల్లడించారు. అయితే ఈ కేసుల విషయంలో చైనా పారదర్శకంగా వ్యవహరించడం లేదని అంతర్జాతీయ మీడియా అరోపిస్తోంది. దీనిపై స్పందించిన చైనా అధికారిక మీడియా మాత్రం వైరస్​పై దాదాపుగా తాము విజయం సాధించినట్లేనని పేర్కొంది.

silent corona spreaders in India
చైనాలో కరోనా లక్షణాలు లేని కరోనా కేసుల భయం

By

Published : Jun 3, 2020, 12:34 PM IST

కరోనా వైరస్​కు ప్రధాన కేంద్రంగా భావిస్తున్న చైనాలోని వుహాన్​లో దాదాపు 10 మిలియన్ల మందికి సామూహికంగా కరోనా పరీక్షలు చేసింది అక్కడి ప్రభుత్వం. ఇందులో ఎంత మందికి కొవిడ్-19 నిర్ధరణ అయిందన్న విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. అయితే 300 మందికి మాత్రం లక్షణాలు లేకుండానే కరోనా వైరస్ సోకినట్లు గుర్తించినట్లు అక్కడి అధికారులు వెల్లడించారు.

9.89 మిలియన్ల మందికి కరోనా పరీక్షలు చేసేందుకు చైనా ప్రభుత్వం సుమారు 126 మిలియన్ డాలర్లు ఖర్చు చేసింది.

సైలెంట్ స్ప్రెడ్డర్స్..

లక్షణాలు లేకుండా బయటపడ్డ కేసులు.. కొత్త సమస్యను తెచ్చిపెడుతున్నాయి. ఇలా కరోనా సోకిన వారిలో దగ్గు, జ్వరం, జలుబు, గొంతునొప్పి వంటి లక్షణాలు లేకున్నా.. వారి నుంచి ఇతరులకు వైరస్ వ్యాపించే ప్రమాదం ఉందని నిపుణులు అంటున్నారు. అందుకే ఇలాంటి కేసులను సైలెంట్ స్ప్రెడ్డర్స్ అని పిలుస్తున్నారు.

వైరస్​పై విజయం!

అయితే ఈ కేసులపై అంతర్జాతీయంగా విదేశీ మీడియా చేస్తున్న ప్రచారాన్ని చైనా అధికారిక వార్తా సంస్థ గ్లోబల్ టైమ్స్ తప్పుబట్టింది. భారీ స్థాయిలో పరీక్షలు నిర్వహించినా.. తక్కువ కేసులు బయటపడటం ద్వారా తాము వైరస్​పై దాదాపు విజయం సాధించినట్లేనని పేర్కొంది.

కరోనా వైరస్​ వ్యాప్తి ప్రారంభమైన 2019 డిసెంబర్ నుంచే కేసులు, మరణాల విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న ఆరోపణలను తోసిపుచ్చుతూ వస్తోంది చైనా.

ఈ ఏడాది జనవరి నాటికి వుహాన్​లో 50,340 కరోనా కేసులు నమోదయ్యాయి. అందులో 3,869 మంది మృతి చెందినట్లు చైనా ఆరోగ్య కమిషన్ వెల్లడించింది.

మంగళవారం నాటికి చైనాలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 83,021కి చేరింది. 4,634 మంది వైరస్​తో ప్రాణాలు కోల్పోయారు. దేశవ్యాప్తంగా 73 మందికి ప్రస్తుతం వైద్యం అందుతోంది. 78,315 మంది వైరస్​ నుంచి కోలుకున్నారు.

ఇదీ చూడండి:'హాంకాంగ్​ విషయంలో చైనా వెనక్కి తగ్గాల్సిందే'

ABOUT THE AUTHOR

...view details