తెలంగాణ

telangana

ETV Bharat / international

కొత్త వైరస్​పై వుహాన్​ సైంటిస్టుల వార్నింగ్- ప్రతి ముగ్గురిలో ఒకరు మృతి! - neocov news

Neocov Virus: కొత్తరకం కరోనా వైరస్ అయిన 'నియోకొవ్​' అత్యంత వేగంగా వ్యాపించగలదని, మరణాల రేటు ఎక్కువగా ఉంటుందని హెచ్చరించారు చైనాలోని వుహాన్​ ల్యాబ్ శాస్త్రవేత్తలు. ప్రస్తుతం ఉన్న టీకాలేవీ ఈ వైరస్​ను ఎదుర్కోలేవని స్పష్టం చేశారు.

Wuhan scientists warn of NeoCov
Wuhan scientists warn of NeoCov

By

Published : Jan 28, 2022, 11:16 AM IST

Updated : Jan 28, 2022, 12:05 PM IST

Neocov Virus: చైనాలోని వుహాన్​ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు మరో బాంబు పేల్చారు. కొత్తరకం కరోనా వైరస్​ అయిన 'నియోకొవ్​'తో పెను ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించారు. ఈ వైరస్​ అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతుందని, మరణాల రేటు ఎక్కువగా ఉంటుందని స్పష్టం చేశారు. వైరస్ సోకిన ప్రతి ముగ్గురిలో ఒకరు చనిపోయే ముప్పు ఉందని అంచనా వేశారు.

అయితే.. నియోకొవ్ వైరస్ కొత్తదేమీ కాదని పేర్కొన్నారు శాస్త్రవేత్తలు. 2012, 2015లో పశ్చిమాసియాలో వ్యాపించిన మెర్స్-కొవ్​కు, నియోకొవ్​కు సంబంధం ఉందని తెలిపారు. నియోకొవ్​ను తొలుత దక్షిణాఫ్రికాలోని గబ్బిలాల్లో గుర్తించారని.. ఇప్పటివరకు మనుషులకు సోకలేదని వివరించారు. ప్రస్తుతం ఇది జంతువుల నుంచి జంతువులకు మాత్రమే పాకుతున్న వైరస్‌గా గుర్తించారు. చైనీస్ అకాడమీ ఆఫ్​ సైన్సెస్​లోని ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ బయోఫిజిక్స్​తో కలిసి వుహాన్​ యూనివర్సిటీ పరిశోధకులు చేసిన ఈ అధ్యయనం బయోఆర్​షివ్​లో ప్రచురితమైంది. అయితే ఈ అధ్యయనాన్ని ఇంకా పీర్​ రివ్యూ చేయలేదు.

ఆ ఒక్క మ్యుటేషన్​తో మనుషులకూ ప్రమాదమే!

అయితే ఇందులోని ఓ మ్యుటేషన్‌ కారణంగా వైరస్‌ జంతువుల నుంచి మనుషులకు సోకే ప్రమాదం ఉందని వుహాన్‌ శాస్త్రవేత్తల అధ్యయనంలో తేలింది. సార్స్‌ - కొవ్ ‌- 2 మాదిరిగా వేగంగా మనుషులకు సోకే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు అంటున్నారు.

'నియో కోవ్‌' వైరస్‌కు.. గబ్బిలాల్లోని యాంజియోటెన్సిన్‌ - కన్వర్టింగ్‌ ఎంజైమ్‌ (ACE2) ప్రభావవంతగా వాడుకొంటుంది. దీనితో పోలిస్తే మనుషుల్లోని ACE2ను ఏమార్చి శరీరంలోకి ప్రవేశించే సామర్థ్యం కొంత తక్కువగా ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు.

రష్యా ఏమందంటే?

ఈ అధ్యయనంపై.. వెక్టార్‌ రష్యన్​ స్టేట్‌ రీసర్చ్‌ సెంటర్‌ ఆఫ్‌ వైరాలజీ అండ్‌ బయోటెక్నాలజీ నిపుణులు స్పందించారు. నియోకొవ్​పై చైనా శాస్త్రవేత్తలు జరిపిన అధ్యయన ఫలితాలు తమకు కూడా తెలుసన్నారు. అయితే ఇది మనుషులకు సోకుతుందా అనేదానిపై ఇప్పుడే ఓ అంచనాకు రాలేమని, మరిన్ని పరిశోధనలు చేయాలని అభిప్రాయపడ్డారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇవీ చూడండి:'ఆ పేలుడు శక్తి.. వందల రెట్ల హిరోషిమా అణుబాంబులకు సమానం'

'ఒమిక్రాన్‌పై ప్రస్తుత ఔషధాల పనితీరు భేష్‌'

Last Updated : Jan 28, 2022, 12:05 PM IST

ABOUT THE AUTHOR

...view details